Abn logo
Aug 9 2020 @ 20:27PM

గుట్కా డాన్ మనోహర్ పై పీడీ యాక్ట్ అమలు

కర్నూలు: కోవెలకుంట్ల గుట్కా డాన్ మనోహర్ పై పీడీ యాక్ట్ అమలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మనోహర్ పై కేసు నమోదు చేసి కడప సెంట్రల్ జైలు కు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. గుట్కా డాన్స్ మనోహర్ పై వివిధ పోలీస్ స్టేషన్లలో 14 కేసులు నమోదైనట్లు చెప్పారు. గత నెల 22న బళ్లారి నుంచి కోవెలకుంట్లకు రూ.60 లక్షల విలువైన గుట్కా పాకెట్లను తరలిస్తుండగా దాడి చేసి పట్టుకున్నట్లు స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో అధికారులు వెల్లడించారు.

Advertisement
Advertisement
Advertisement