సంజయ్ రౌత్‌కు enforcement directorate షాక్.. సమన్లు జారీ

ABN , First Publish Date - 2022-07-20T03:46:15+05:30 IST

ముంబై: శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ షాకిచ్చింది. బుధవారం ఉదయం 11 గంటలకు తమ కార్యాలయానికి రావాలని సమన్లు జారీ చేసింది.

సంజయ్ రౌత్‌కు enforcement directorate షాక్.. సమన్లు జారీ

ముంబై: శివసేన (shiv sena) ఎంపీ సంజయ్ రౌత్‌ (sanjay raut) కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (enforcement directorate) షాకిచ్చింది. బుధవారం ఉదయం 11 గంటలకు తమ కార్యాలయానికి రావాలని సమన్లు జారీ చేసింది. మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఈ సమన్లు జారీ చేసింది. 




మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద రౌత్, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఏప్రిల్‌లో అటాచ్ చేసింది. జప్తు చేసిన ఆస్తుల్లో అలీబాగ్‌లో రూ.9 కోట్లు విలువచేసే ఎనిమిది ల్యాండ్ పార్సెల్స్ (ప్లాట్లు), ముంబై, దాదర్ శివార్లలో ఉన్న రూ.2 కోట్లు విలువచేసే ఒక ఫ్లాట్ ఉన్నాయి. ముంబైలోని ఓ భారీ రెసిడిన్షియల్ బిల్డింగ్ రీ-డవలప్‌మెంట్‌కు సంబంధించి రూ.1,034 కోట్ల విలువైన ల్యాండ్ స్కామ్‌లో మనీ ల్యాండరింగ్ దర్యాప్తులో భాగంగా జప్తు చేశారు.

Updated Date - 2022-07-20T03:46:15+05:30 IST