ముంబై : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే (Udhav Thackeray) సన్నిహితుడు, రాష్ట్ర మంత్రి అనిల్ పరబ్ (Anil Parab) ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం సోదాలు చేసింది. డపోలీ సిటీలోని ఆయన ఇంటితోపాటు ముంబై, పుణేలలోని మరికొన్ని చోట్ల కూడా సోదాలు నిర్వహించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల ప్రకారం ఆయనపై కేసు నమోదు చేసింది.
అనిల్ పరబ్ మహారాష్ట్ర (Maharashtra) రవాణా శాఖ మంత్రి. ఆయన శివసేన (ShivSena) నేత. ఆయనకు డపోలీ సిటీలో ఓ రిసార్ట్ ఉంది. ఇక్కడి భూమిని 2017లో కొన్నపుడు అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు నమోదయ్యాయి. మొత్తం మీద ఏడు చోట్ల ఈడీ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం.
మహారాష్ట్రకు చెందిన మరో మంత్రి, ఎన్‌సీపీ నేత నవాబ్ మాలిక్ (Nawab Malik) ఫిబ్రవరిలో మనీలాండరింగ్ కేసులో అరెస్టయ్యారు. ఆయనకు దావూద్ ఇబ్రహీం (Dawood Ibrahim)తో సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం మాలిక్ జైలులో ఉన్నారు.
శివసే, ఎన్‌సీపీ, కాంగ్రెస్ కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తమ నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తూ, అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని బీజేపీపై ఈ కూటమి ఆరోపణలు గుప్పిస్తోంది.
ఇవి కూడా చదవండి