Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Thu, 24 Mar 2022 17:53:01 IST

అభిషేక్ బెనర్జీకి ఈడీ సమన్లు

twitter-iconwatsapp-iconfb-icon
అభిషేక్ బెనర్జీకి ఈడీ సమన్లు

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం సమన్లు జారీ చేసింది. రాష్ట్రంలో బొగ్గు కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈ నెల 29న హాజరు కావాలని ఆదేశించింది. ఆయన ముఖ్యమంత్రి మమత బెనర్జీ సమీప బంధువు అనే సంగతి తెలిసిందే. 


అభిషేక్ బెనర్జీ సోమవారం న్యూఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో అధికారుల సమక్షంలో హాజరయ్యారు. అధికారులు ఆయనను దాదాపు 8 గంటలపాటు ప్రశ్నించారు. తాము సేకరించిన సాక్ష్యాధారాలను చూపి, ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం ఆయన స్టేట్‌మెంట్‌ను నమోదు చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. ఈ కేసులో ఇతర నిందితులతో ఆయనకుగల సంబంధాలపై ఆరా తీస్తున్నట్లు తెలిపారు. 


విచారణ అనంతరం అభిషేక్ మాట్లాడుతూ, తాను చట్టానికి విధేయంగా వ్యవహరించే పౌరుడినని, అందుకే దర్యాప్తుకు సహకరించానని చెప్పారు. ఈడీ, సీబీఐ, ఆదాయపు పన్ను శాఖ వంటివాటిని బీజేపీ దుర్వినియోగపరుస్తోందని, రాజకీయ ప్రత్యర్థులను భయపెట్టేందుకు వినియోగించుకుంటోందని ఆరోపించారు. గత ఏడాది సెప్టెంబరులో కూడా ఆయనను ఇదే కేసులో ఈడీ ప్రశ్నించింది. 


ఈ కేసులో అభిషేక్ బెనర్జీని, ఆయన సతీమణి రుజిరను న్యూఢిల్లీలోని కార్యాలయంలో హాజరుకావాలని గతంలో ఈడీ సమన్లు జారీ చేసింది. కోల్‌కతాలోని ఈడీ కార్యాలయానికి బదులుగా న్యూఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో హాజరుకావాలని సమన్లు జారీ చేయడాన్ని ఈ దంపతులు ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు. అయితే వీరి పిటిషన్‌ను హైకోర్టు మార్చి 11న తోసిపుచ్చింది. అభిషేక్ సుప్రీంకోర్టులో ప్రత్యేక అనుమతి అర్జీ (ఎస్ఎల్‌పీ)ని దాఖలు చేశారు. ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో హాజరవాలని సమన్లు జారీ చేయడాన్ని సవాల్ చేశారు. 


పశ్చిమ బెంగాల్‌లోని కునుస్టోరియా, కరోరా, అసన్‌సోల్ ప్రాంతాల్లో ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌కు చెందిన బొగ్గు క్షేత్రాల్లో బొగ్గు కుంభకోణం జరిగినట్లు సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ) 2020 నవంబరులో కేసు నమోదు చేసింది. ఈ లావాదేవీల్లో మనీలాండరింగ్ జరిగినట్లు ఆరోపిస్తూ కేసును ఈడీ  నమోదు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు అనూప్ మాఝీ వురపు లాలా. చట్టవిరుద్ధ వ్యాపార లావాదేవీల ద్వారా లభించిన నిధుల లబ్ధిదారు అభిషేక్ బెనర్జీ అని ఈడీ ఆరోపించింది. ఈ కేసులో ఈడీ ఇప్పటి వరకు ఇద్దర్ని అరెస్టు చేసింది. అరెస్టయినవారిలో ఒకరు వికాస్ మిశ్రా. ఆయన టీఎంసీ యువజన విభాగం నేత వినయ్ మిశ్రాకు సోదరుడు. వికాస్ దేశం విడిచి వెళ్ళిపోయి, భారత దేశ పౌరసత్వాన్ని కూడా వదులుకున్నట్లు సమాచారం. అరెస్టయినవారిలో రెండో వ్యక్తి బంకుర పోలీస్ స్టేషన్ మాజీ ఇన్‌స్పెక్టర్ ఇన్‌ఛార్జి అశోక్ కుమార్. 


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

జాతీయంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.