కొడియేరి బాలకృష్ణన్ తనయుడిని అరెస్ట్ చేసిన ఈడీ

ABN , First Publish Date - 2020-10-30T00:57:58+05:30 IST

కేరళ సీపీఎం నేత కొడియేరి బాలకృష్ణన్ తనయుడు బినీష్ కొడియేరిని

కొడియేరి బాలకృష్ణన్ తనయుడిని అరెస్ట్ చేసిన ఈడీ

బెంగళూరు : కేరళ సీపీఎం నేత కొడియేరి బాలకృష్ణన్ తనయుడు బినీష్ కొడియేరిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం అరెస్ట్ చేసింది. మాదక ద్రవ్యాలు, మనీలాండరింగ్ కేసులో ఈ చర్య తీసుకుంది. మాదక ద్రవ్యాల నెట్‌వర్క్‌కు నిధులు సమకూర్చినందుకు ఆయనను కస్టడీలో ఉంచి ప్రశ్నించవలసిన అవసరం ఉందని తెలిపింది. 


ఈడీ అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం, బినీష్‌ను మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం అరెస్టు చేశారు. ఆయన ఓ మాదక ద్రవ్యాల నెట్‌వర్క్‌కు నిధులు సమకూర్చారని ఆరోపిస్తూ, ఆయనను కస్టడీలో ఉంచి ప్రశ్నించవలసి ఉందని తెలిపింది. ఆయనను నాలుగు రోజులపాటు ఈడీ కస్టడీకి స్థానిక కోర్టు ఆదేశించింది. నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆగస్టులో కర్ణాటకలో మాదక ద్రవ్యాల రవాణా ముఠా గుట్టు రట్టు చేసింది. ముగ్గుర్ని అరెస్టు చేసింది. వీరిలో ఎం అనూప్ అనే నిందితుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా బినీష్‌ను ఈడీ ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. అనూప్‌తో బినీష్ సంబంధాల గురించి ఇప్పటికే బినీష్‌ను మూడుసార్లు ప్రశ్నించినట్లు సమాచారం.



Updated Date - 2020-10-30T00:57:58+05:30 IST