Abn logo
Sep 20 2021 @ 23:23PM

భవన నిర్మాణ కార్మిక చట్టం అమలు చేయండి

టెక్కలిలో నిరసన తెలుపుతున్న భవన నిర్మాణ కార్మికులు

టెక్కలి/పలాస/పలాస రూరల్‌/రాజాం రూరల్‌: భవన నిర్మాణ కార్మికుల చట్టం అమలుచేసి కార్మికులకు న్యాయం చేయా లని సీఐటీయూ నాయకులు నంబూరు షన్ముఖరావు, ఎన్‌. గణ పతి, సీహెచ్‌రామ్మూర్తి నాయుడు కోరారు. సోమవారం టెక్కలి మండలం తొలుసూరుపల్లి, పలాస ఇందిరా చౌక్‌, పలాస మండలం మాకన్నపల్లి, రంగోయి, రాజాం అంబేడ్కర్‌ కూడలిలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కార్మికులు జమచేసిన డబ్బులు రూ.2500 కోట్లు మళ్లించడానికి సీఎంకి అధికారం ఎక్కడ ఉందని ప్రశ్నించారు. తక్షణం వారిని ఆదుకోవాలని కోరారు కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికుల సంఘం నాయకులు బమ్మిడి అప్పన్న, త్రినాథ్‌, నారా యణరావు, టి.గోవింద్‌, టి.సింహాద్రి ఆర్‌. హేమసుందర్‌, సూర్య నారాయణ, శంకరరావు, పాపినాయుడు, ఈశ్వరరావు, సీఐటీయూ, భవన నిర్మాణ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.