హామీలను అమలు చేయండి

ABN , First Publish Date - 2021-07-27T05:18:05+05:30 IST

వీఆర్‌ఏలకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని వీఆర్‌ఏల సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. హామీల అమలుకోసం ఆగస్టు 4న చేపట్టనున్న చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.

హామీలను అమలు చేయండి
కలెక్టరేట్‌ ఎదుట చేపట్టిన ధర్నాలో మాట్లాడుతున్న వీఆర్‌ఏల సంఘం జిల్లా అధ్యక్షుడు ధైర్యం

వీఆర్‌ఏల డిమాండ్‌

4న ‘చలో విజయవాడ’కు పిలుపు

కడప (రవీంద్రనగర్‌), జూలై 26 : వీఆర్‌ఏలకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని వీఆర్‌ఏల సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. హామీల అమలుకోసం ఆగస్టు 4న చేపట్టనున్న చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ మేరకు వీరు సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం జిల్లా అధ్యక్షుడు ధైర్యం మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల ముందు గ్రామ సేవకులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, కనీస వేతనం రూ.21వేలు ఇవ్వాలని, నామినీలుగా గుర్తించాలని, పదోన్నతులు ఇవ్వాలని కోరారు. డీఏలు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. గ్రామ సచివాలయాలకు వీఆర్‌ఏలను అప్పజెప్పడంతో పనిభారం పెరిగిందన్నారు. వెంటనే వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలని ఆగస్టు 4న చేపట్టే చలో విజయవాడ ధర్నాకు వీఆర్‌ఏలు పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఏసురత్నం, వెంకటసుబ్బయ్య, పుల్లన్న, నాగరాజు, సిద్దయ్య, జిల్లాలోని అన్ని మండలాల అధ్యక్ష కార్యదర్శులు, వీఆర్‌ ఏలు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-27T05:18:05+05:30 IST