Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్... షేర్లు పది శాతం జంప్...

హైదరాబాద్ : డిసెంబ రు 6(సోమవారం)... తన బోనస్ ఇష్యూకు  ఎక్స్ డేట్‌గా ప్రకటించిన నేపధ్యంలో... ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్ షేర్లు ఈ రోజు(శుక్రవారం) ఇంట్రాడేలో ఇరగదీశాయి. గతంలో ఎన్నడూ లేనట్లుగా... ఈ రెండు నెలల కాలంలో... పది శాతం పెరిగాయి.  ఈ బోనస్ ఇష్యూ ప్రతీ షేరుకు రెండు షేర్లను ఇస్తమన్న ప్రాతిపదికన కొనసాగింది. ఈ క్రమంలో... షేరు ధర రూ. 267 కు ఎగసింది.అంతకుముందు ఈ షేర్లు గత నెల రోజులుగా దాదాపు రూ. 700-రూ. 850 మధ్యలో కొనసాగాయి. ప్రీ బోనస్ ట్రేడింగ్ కావడంతో షేర్ల లావాదేవీలు ఏకంగా మూడింతలయ్యాయి. ఎన్ఎస్ఈ, బిఎస్ఈల్లో కలిపి  ఇప్పటికే... రెండు కోట్లకు పైగా షేర్లు  ట్రేడయ్యాయి. స్టాక్ బోనస్ ఇచ్చిన తర్వాత అడ్జస్ట్ చేసిన ధర ప్రకారం చూస్తే  రూ. 318.40 ధర వద్ద ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజి 52వారాల గరిష్టాన్ని తాకింది. డిసెంబరు 6 నాటికి డీ మ్యాట్ ఖాతాల్లో షేర్లు ఉంటే... బోనస్ షేర్లు కలుస్తాయి. గత ఆరు నెలల కాలంలో ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్ షేరు ధర 125 శాతం పెరిగింది. అదే డాదికాలంతో పోల్చితే ఏకంగా 273 శాతం పెరిగింది. ప్రస్తుతం ఇండియన్ ఎనర్జీ  ఎక్స్ఛేంజ్ షేర్లు రూ. 262.90 వద్ద ట్రేడవుతున్నాయి. 

Advertisement
Advertisement