వీడని తాగునీటి కష్టాలు

ABN , First Publish Date - 2022-07-28T05:30:00+05:30 IST

తాటిపూడి పైలెట్‌ ప్రాజెక్టు నుంచి రెండు నెలల్లో నాలుగు రోజులు మాత్రమే పరిశుభ్రమైన తాగునీరు సరఫరా అయింది. మే నెలాఖరు నుంచి ఇంతవరకు సక్రమంగా తాగునీరు ఇవ్వడం లేదు. బురద నీరు... లేదంటే పూర్తిగా నీటి సరఫరాను నిలిపేయడం చేస్తున్నారు.

వీడని తాగునీటి కష్టాలు
అపరిశుభ్రంగా తాగునీరు

 రెండు నెలలుగా సక్రమంగా సరఫరా కాని నీరు
 99 గ్రామాల ప్రజలకు  కొనసాగుతున్న తిప్పలు
శృంగవరపుకోట, జూలై 28:
తాటిపూడి పైలెట్‌ ప్రాజెక్టు నుంచి రెండు నెలల్లో నాలుగు రోజులు మాత్రమే పరిశుభ్రమైన తాగునీరు సరఫరా అయింది. మే నెలాఖరు నుంచి ఇంతవరకు సక్రమంగా తాగునీరు ఇవ్వడం లేదు. బురద నీరు... లేదంటే పూర్తిగా నీటి సరఫరాను నిలిపేయడం చేస్తున్నారు. దీంతో ఎస్‌.కోట నియోజకవర్గంలోని 99 గ్రామాల ప్రజలు తాగునీటికోసం ఇబ్బందులు పడుతున్నారు.
ముఖ్యంగా శృంగవరపుకోట పట్టణ ప్రజలు తాగునీటి కోసం వాటర్‌ ప్లాంటులను ఆశ్రయి స్తున్నారు. రూ.10 నుంచి రూ.40 చెల్లించి టిన్‌లను కోనుగోలు చేసుకుంటు న్నారు. పత్రికల్లో కథనాలు వచ్చినప్పుడు అధికారులు పర్యవేక్షణల పేరుతో హడావిడి చేస్తున్నారు. ఆ తరువాత పట్టించుకోకపోవడంతో తాగునీటి సరఫరాలో నిత్యం అంతరాయం ఏర్పడుతోంది. రెండు నెలల క్రితం బురద నీరు సరఫరా కావడంతో తాగునీటి సరఫరా అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో పైలెట్‌ ప్రాజెక్టు కేంద్రం వద్ద శుభ్రం చేసేందుకు సరఫరాను కొద్దిరోజులు నిలిపేశారు. ఆ తరువాత మళ్లీ బురద నీరే వచ్చింది. దీంతో మోటార్లు కాలిపోయాయని సరఫరాను ఆపేశారు. వాటిని బాగు చేసి తాగునీటిని సరఫరా చేసినా బురద నీరే వస్తోంది. ఈ పరిస్థితిపై ‘ఆంధ్రజ్యోతి’లో వరస కథనాలు రావడంతో ఉన్నతాధికారులు పర్యవేక్షించి రెండు రోజుల తరువాత పరిశుభ్రమైన తాగునీరు వస్తుందని చెప్పారు. నాలుగు రోజుల పాటు తాగేందుకు అనుకూలమైన నీరు సరఫరా చేశారు. ఇప్పుడు తిరిగి వారం రోజుల నుంచి మళ్లీ యథాస్థితిలో నీరు సరఫరా అవుతోంది. తాగునీటిని సక్రమంగా సరఫరా చేసేందుకు  సిబ్బందితో మాట్లాడానని, ఇక నుంచి రోజూ సరఫరా ఉంటుందని డీఈ గోవిందరావు వివరణ ఇచ్చారు.


Updated Date - 2022-07-28T05:30:00+05:30 IST