గొరగనమూడిలో ఆక్రమణ తొలగింపు పనులు
పాలకోడేరు, మే 18: మండల పరిధిలో జాతీయ రహదారి వెంబడి ఆక్రమణలు తొలగింపు కార్యక్రమం గురువారం కూడా సాగింది. విస్సాకోడేరు, గొరగనమూడి, పెన్నాడ, శృంగవృక్షం గ్రామాల్లోని జాతీయ రహదారికి చేర్చి దుకాణాలు, చిన్న చిన్న చెట్లను, ఆయా గ్రామ పంచాయతీ సిబ్బంది గురువారం తొలగించారు. గొరగనమూడి సర్పంచ్ శివాజీ రాజు నేతృత్వంలో గ్రామంలో ఉన్న ఆక్రమణలను ప్రొక్లయిన్ పెట్టి తొలగించారు.
వీరవాసరంలో ఆక్రమణల తొలగింపు అలజడి
వీరవాసరం: రహదారి మార్జిన్లో ఆక్రమణల తొలగింపు స్వచ్ఛందంగా తొలగించుకోవాలని పంచాయతీ అధికారులు మైక్ ప్రచారం చేశారు. వీరవాసరం పశ్చిమ కాలువనుంచి రహదారి మార్జిన్ వెంబడి ఆక్రమణ దారుల్లో గుబులు రేగింది. పంట కాలువ నుంచి బస్టాండ్ సెంటర్ వరకూ ఒకరిని చూసి ఒకరు రహదారి మార్జిన్ ఆక్రమించారు. కరోనా నేపధ్యంలో సంత లేకపోవడంతో కూరగాయ వ్యాపారుల దుకాణాలు రహదారి మార్జిన్‌కు చేర్చారు. వీటిపై పంచాయతీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో అలాగు కొనసాగుతున్నాయి. ఆక్రమణలపై పంచాయతీ హెచ్చరికల నేపథ్యంలో ఏమి చేయాలా అనే ఆలోచనలో ఉన్నారు.