పండ్లు, కూరగాయల రైతులకు ప్రోత్సాహం

ABN , First Publish Date - 2022-08-08T05:32:38+05:30 IST

పండ్లు, కూరగాయలు సాగుచేసే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం కల్పిస్తున్నట్లు రాష్ట్ర ఉద్యాన శాఖ కమిషనర్‌ వెంకటరాంరెడ్డి అన్నా రు. ఆదివారం మండలంలోని అనాజీపురంలో రైతు గోపాల్‌ రెడ్డి సాగు చేస్తున్న డ్రాగన్‌ ఫ్రూ ట్‌, శ్రీగంధం క్షేత్రాన్ని, అదే గ్రామానికి చెందిన హనుమంతరెడ్డి సాగు చేస్తున్న జామ, బత్తాయి, సీతాఫలం పంటలను ఆయన పరిశీలించారు.

పండ్లు, కూరగాయల రైతులకు ప్రోత్సాహం
భువనగిరి మండలంలో డ్రాగన్‌ఫ్రూట్‌ సాగును పరిశీలిస్తున్న వెంకటరాంరెడ్డి

రాష్ట్ర ఉద్యాన శాఖ కమిషనర్‌ వెంకటరాంరెడ్డి 

భువనగిరి రూరల్‌, ఆగస్టు 7: పండ్లు, కూరగాయలు సాగుచేసే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం కల్పిస్తున్నట్లు రాష్ట్ర ఉద్యాన శాఖ కమిషనర్‌ వెంకటరాంరెడ్డి అన్నా రు. ఆదివారం మండలంలోని అనాజీపురంలో రైతు గోపాల్‌ రెడ్డి సాగు చేస్తున్న డ్రాగన్‌ ఫ్రూ ట్‌, శ్రీగంధం క్షేత్రాన్ని, అదే గ్రామానికి చెందిన హనుమంతరెడ్డి సాగు చేస్తున్న జామ, బత్తాయి, సీతాఫలం పంటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వెంకటరాంరెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్‌కు అతిచేరువలో ఉండి మెరుగైన రవాణా సౌకర్యం కలిగి ఉండ డం వల్ల జిల్లాలోని రైతులు ఉద్యాన పంటల సాగుకు చొరవ చూపాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సగటు మనిషి తీసుకోవాల్సిన దానికన్నా తక్కువ కూరగాయలను వినియోగిస్తున్నారని, అలా కాకుండా తీసుకునే ఆహారంలో కూరగాయల శాతం ఎక్కువ ఉండాలన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆయిల్‌పామ్‌ సాగును ప్రోత్సహిస్తున్న తరుణంలో 2023 సంవత్సరానికి గాను 6800 ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సా గు లక్ష్మాన్ని జిల్లాకు కేటాయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యాన అధికారి అన్నపూర్ణ, రైతులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-08T05:32:38+05:30 IST