పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం

ABN , First Publish Date - 2022-10-04T05:08:58+05:30 IST

పారిశ్రామికరంగ అభివృద్ధి, ఉపాధి కల్పనకు

పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం
లక్ష్మీనారాయణను సన్మానిస్తున్న నాయకులు

ఆమనగల్లు, అక్టోబరు 3 : పారిశ్రామికరంగ అభివృద్ధి, ఉపాధి కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ అమరవాది లక్ష్మీనారాయణ అన్నారు. ఆమనగల్లులోని శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయాన్ని సోమవారం లక్ష్మీనారాయణ సందర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షుడు వీరబొమ్మ రామ్మోహన్‌, ప్రధాన కార్యదర్శి బికుమాండ్ల నర్సింహ, కోశాధికారి బికుమాండ్ల శ్రీనివాస్‌, ఆర్యవైశ్య సంఘం జిల్లా నాయకుడు మాండెం చంద్రశేఖర్‌, ఆలయ వైస్‌చైర్మన్‌ బికుమాండ్ల పాండయ్య ఆధ్వర్యంలో లక్ష్మీనారాయణను సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలా ప్రోత్సాహిస్తుండటంతో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వివిధ దేశాల పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ స్థాపించే జాతీయ పార్టీ ప్రజల ఆశీర్వాదం పొందాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో జూలూరి గోపాల్‌, బొజ్జ నర్సింహ, మంచుకొండ విష్ణువర్ధన్‌, రాగిద్ది లక్ష్మీనారాయణ, విజయ్‌, శ్యామ్‌సుందర్‌, అనుదీప్‌, రవి, ఆనంద్‌, సురేశ్‌, కొట్ర మల్లేశ్‌ పాల్గొన్నారు. 






Updated Date - 2022-10-04T05:08:58+05:30 IST