రైతుల్లో ధైర్యం నింపండి

ABN , First Publish Date - 2022-06-16T06:54:14+05:30 IST

రైతులు మూడేళ్లుగా సంక్షోభంలో కూరుకుపోయారని, పంటలు పండక ధైర్యం కోల్పోయే పరిస్థితులు కనిపిస్తున్నాయని పీఏసీ చైర్మన పయ్యావుల కేశవ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

రైతుల్లో ధైర్యం నింపండి

ఈ-క్రాప్‌ బుకింగ్‌ పరిశీలించి న్యాయం చేయండి.. 

ప్రభుత్వానికి పీఏసీ ైర్మన పయ్యావుల లేఖ

అనంతపురం, జూన 15(ఆంధ్రజ్యోతి): రైతులు మూడేళ్లుగా సంక్షోభంలో కూరుకుపోయారని, పంటలు పండక ధైర్యం కోల్పోయే పరిస్థితులు కనిపిస్తున్నాయని పీఏసీ చైర్మన పయ్యావుల కేశవ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి దయనీయ పరిస్థితుల్లో ఉచిత పంటల బీమా జాబితాలో పేర్లు లేకపోవడంతో రైతులు మరింత ఆవేదన చెందుతున్నారని అన్నారు. ఈ-క్రాప్‌ బుకింగ్‌ను పరిశీలించి, బీమా పరిహారం అందించి రైతుల్లో ఽధైర్యం నింపాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం ప్రభుత్వానికి లేఖ రాశారు. ఉచిత పంటల బీమా, డ్రిప్‌ కంపెనీలకు సబ్సీడీ నిధులు విడుదల తదితర అంశాలను ఆయన ప్రస్తావించారు. బీమా అర్హుల జాబితాలో 70 శాతం మంది రైతుల పేర్లు లేవని, బాధితులు ఆవేదన చెందుతున్నారని పేర్కొన్నారు. పరిహారం అందని రైతులు ఆర్‌బీకేల్లో 15 రోజుల్లోగా పేర్లు నమోదు చేసుకోవాలని చెబుతున్నా, క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉండటం లేదని కేశవ్‌ పేర్కొన్నారు. కరువుతో అల్లాడిపోతున్న జిల్లా రైతులు అత్యధిక మంది డ్రిప్‌, స్ర్పింక్లర్ల ద్వారానే పంటలు పండించుకుంటున్నారని గుర్తు చేశారు. డ్రిప్పు, స్ర్పింక్లర్ల ధరలు భారీగా పెరిగాయని, సబ్సిడీ ఇవ్వకపోతే రైతులపై భారం పడుతుందని పేర్కొన్నారు. మూడేళ్ల నుంచి పథకాన్ని అమలు చేయడం లేదని, ప్రస్తుతం డ్రిప్‌, స్ర్పింక్లర్ల కోసం రిజిష్టర్‌ చేసుకోవాలని ప్రభుత్వం చెబుతున్నా.. సబ్సిడీ నిధులు వస్తేనే పరికరాలు ఇస్తామని డ్రిప్‌ కంపెనీలు స్పష్టం చేస్తున్నాయని కేశవ్‌ గుర్తు చేశారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని, డ్రిప్‌ కంపెనీలకు వెంటనే సబ్సిడీ నిధులు విడుదల చేయాలని ఆయన లేఖలో కోరారు. 


Updated Date - 2022-06-16T06:54:14+05:30 IST