గ్యారాపత్తి ఎన్‌కౌంటర్‌పై న్యాయ విచారణ జరిపించాలి: మావోయిస్టు పార్టీ

ABN , First Publish Date - 2021-11-14T20:11:40+05:30 IST

గ్యారాపత్తి ఎన్‌కౌంటర్‌పై న్యాయ విచారణ జరిపించాలని మావోయిస్టు పార్టీ డిమాండ్ చేసింది. సీపీఐ మావోయిస్టు భద్రాద్రికొత్తగూడెం-తూర్పుగోదావరి డివిజన్‌

గ్యారాపత్తి ఎన్‌కౌంటర్‌పై న్యాయ విచారణ జరిపించాలి: మావోయిస్టు పార్టీ

కొత్తగూడెం: గ్యారాపత్తి ఎన్‌కౌంటర్‌పై న్యాయ విచారణ జరిపించాలని మావోయిస్టు పార్టీ డిమాండ్ చేసింది. సీపీఐ మావోయిస్టు భద్రాద్రికొత్తగూడెం-తూర్పుగోదావరి డివిజన్‌ కమిటీ పేరుతో లేఖను విడుదల చేశారు. ఇరు రాష్ట్రాల సమన్వయంతోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని దుయ్యబట్టారు. మావోయిస్టు ఉద్యమాలను అణచివేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. పోలీసుల ద్వారా ఇన్‌ఫార్మర్‌ వ్యవస్థను పెంచి పోషిస్తున్నాయని మవోలు మండపడ్డారు. గ్యారాపత్తి ఎన్‌కౌంటర్‌కు కేంద్రం, 3 రాష్ట్రాలు బాధ్యత వహించాలని మావోయిస్టు పార్టీ డిమాండ్ చేసింది.


మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా గ్యారాపత్తి అడవుల్లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 26 మంది మావోయిస్టులు మృతిచెందగా.. వారిలో కేంద్ర కమిటీ సభ్యుడు, మధ్యప్రదేశ్‌-మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్‌(ఎంఎంసీ) జోన్‌లో మావోయిస్టుల రిక్రూట్‌మెంట్లు, విస్తరణ బాధ్యతలు చూస్తున్న మిలింద్‌ బాబూరావ్‌ తేల్టుంబ్డే అలియాస్‌ జీవా అలియాస్‌ దీపక్‌ తేల్టుంబ్డే ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం 26 మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. వారిని గుర్తించాల్సి ఉందని చెబుతున్నా.. మృతుల్లో తేల్టుంబ్డేతోపాటు మావోయిస్టు పార్టీ దర్భా కమిటీ సభ్యుడు సుఖ్‌లాల్‌ ఉన్నారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

Updated Date - 2021-11-14T20:11:40+05:30 IST