Advertisement
Advertisement
Abn logo
Advertisement
Jul 24 2021 @ 10:08AM

north Kashmir: ఇద్దరు ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్

శ్రీనగర్ : జమ్మూకశ్మీరులో శనివారం మరో ఎన్ కౌంటర్ జరిగింది. ఉత్తర కశ్మీరులోని బండిపొరా జిల్లా సోక్ బాబా అడవుల్లో శనివారం ఉదయం భద్రతాబలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు.బండిపొరాలోని సోక్ బాబా అడవుల్లో ఉగ్రవాదులు దాక్కున్నారనే సమాచారం మేర కేంద్ర భద్రతా బలగాలు శుక్రవారం మధ్యాహ్నం నుంచి గాలింపు చేపట్టాయి. శనివారం ఉదయం అడవిలో దాక్కున్న ఉగ్రవాదులు జవాన్లను చూసి వారిపై కాల్పులు జరిపారు. జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు గుర్తుతెలియని ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదుల కోసం సైనికులు గాలింపు కొనసాగిస్తున్నారు. 


Advertisement
Advertisement