Abn logo
Jul 13 2020 @ 10:03AM

అనంత్‌నాగ్‌లో మళ్లీ ఎన్‌కౌంటర్..ఉగ్రవాది హతం

అనంత్‌నాగ్ (జమ్మూకశ్మీర్): జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా శ్రీగుఫ్వారా ప్రాంతంలో సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో గుర్తుతెలియని ఉగ్రవాది ఒకరు మరణించారు. శ్రీగుఫ్వారా ప్రాంతంలోని పహల్ గాంలో ఉగ్రవాదులున్నారనే సమాచారం మేర జమ్మూకశ్మీర్ పోలీసులు, రాష్ట్రీయ రైఫిల్స్, సీఆర్ పీఎఫ్ జవాన్లతో కలిసి గాలిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో గుర్తుతెలియని ఉగ్రవాది ఒకరు మరణించారు. ఆదివారం బారాముల్లాలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు. 

Advertisement
Advertisement
Advertisement