Pulwamaలో ఉగ్రవాదులకు, భద్రతాబలగాలకు మధ్య ఎదురుకాల్పులు

ABN , First Publish Date - 2022-01-05T17:28:28+05:30 IST

జమ్మూకశ్మీరులోని పుల్వామా జిల్లాలో బుధవారం ఉదయం ఉగ్రవాదులకు, కేంద్ర భద్రతాదళాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి...

Pulwamaలో ఉగ్రవాదులకు, భద్రతాబలగాలకు మధ్య ఎదురుకాల్పులు

పుల్వామా : జమ్మూకశ్మీరులోని పుల్వామా జిల్లాలో బుధవారం ఉదయం ఉగ్రవాదులకు, కేంద్ర భద్రతాదళాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. పుల్వామా జిల్లా చంద్‌గాం ఏరియాలో ఎదురు కాల్పులు జరిగాయి. ఇద్దరు ఉగ్రవాదులు చంద్‌గాం ఏరియాలో ఉన్నట్లు సమాచారం అందడంతో తాము కేంద్ర భద్రతా బలగాలతో కలిసి బుధవారం ఉదయం గాలింపు చేపట్టామని కశ్మీర్ జోన్ పోలీసులు చెప్పారు. ఉగ్రవాదులు కాల్పులు జరపడటంతో తాము ఎదురు కాల్పులు జరిపామని పోలీసులు చెప్పారు. 


Updated Date - 2022-01-05T17:28:28+05:30 IST