సంతరించుకున్న సంక్రాంతి శోభ

ABN , First Publish Date - 2021-01-14T05:22:51+05:30 IST

మండల కేంద్రమైన ముథోల్‌తో పాటు మండలం లోని ఆయాగ్రామాలల్లో బుధవారం ప్రజలు భోగిపండుగను ఘనంగా జరుప ుకున్నారు,

సంతరించుకున్న సంక్రాంతి శోభ
గాలిపటాలు ఎగరవేస్తున్న చిన్నారులు

ముథోల్‌, జనవరి, 13 : మండల కేంద్రమైన ముథోల్‌తో పాటు మండలం లోని ఆయాగ్రామాలల్లో బుధవారం ప్రజలు భోగిపండుగను ఘనంగా జరుప ుకున్నారు, ఈ సందర్భంగా మహిళలు ఇంటిముందు రంగురంగుల ముగ్గులు వేసి. ఇంటి ముందు ఆవుపేడతో రూపొందించిన గొబ్బెమ్మలను పెట్టారు. బంతి, చామంతిపూలు నవధాన్యాలు, రేగుపండ్లు, చెరుకుముక్కలతో అలంకరిం చారు. ఇలాచేయడం వలన కుటుంబసభ్యులు సుఖసంతోషాలతో పాటు అష్టఐశ్వర్యాలు సిధ్దిస్తాయని ప్రజలనమ్మకం, అనంతరం  పేరంటాలు జరిపి రేగుపండ్లు, చెరుకుముక్కలు, చాకెట్లు కలిపి చిన్నపిల్లలకు భోగిపండ్లు పోశారు. ఉదయాన్నే ఆలాయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఏ పల్లెచూసిన పిండి వంటల తయారీ, రంగురంగుల ముగ్గులు, గాలిపటాల రెపరెపలు చిన్నపిల్లల కేరింతలతో సంక్రాంతి శోభ సంతరించుకుంది

పిండివంటల తయారీలో మహిళలు బిజీబిజీ

ఖానాపూర్‌, జనవరి 13 : భోగీపండుగను ఖానాపూర్‌ పట్టణంలో బుధవారం ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. పిండివంటల తయారీలో మహిళలు తలమునకలయ్యారు. ప్రతివంటకంలో నువ్వులను మమేకం చేస్తూ చకినాలు, గారెలు, అరిసెలు లాంటి సంక్రాంతికి ప్రత్యేకంగా తయారు చేసే వంటకాలను సిద్దం చేస్తున్నారు. గాలిపటాలను ఎగురవేస్తూ చిన్నారులు సందడిగా గడుపుతున్నారు. బంధువుల రాకతో పట్టణంలో రద్దీ వాతవరణం నెలకొంది. నేడు భోగిపండగను పురష్కరించుకుని చిన్నారులకు భోగిస్నానాలు చేయించారు. శాస్త్రయుక్తంగా తెల్లవారు జామున భోగి మంటలతో మకర సంక్రాంతి పండగకు స్వాగతం చెబుతూ తమ జీవితాల్లో సంబురాలు నింపాలని పూజలు నిర్వహించారు.

బావాపూర్‌ (కె) లో ముగ్గుల పోటీలు 

ఖానాపూర్‌ రూరల్‌, జనవరి 13 ; ఖానాపూర్‌ మండలంలోని బావాపూర్‌ (కె) గ్రామంలో బుధవారం మహిళా రైతు కుటుంబాలకు సంక్రాతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఓ ప్రైవేటు కంపెనీ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వ హించగా 25 మంది వరకు పాల్గొని వివిద రకాల ముగ్గులు వేసారు. మహిళ లు వేసిన రంగవల్లులు ఎంతగానో ఆకట్టుకున్నాయి. రైతులకు సంబందించిన అనేక రకాల ముగ్గులు అందంగా వేసారు. కార్యక్రమంలో సర్పంచ్‌ బీర్ల లక్ష్మీనర్సయ్య పాల్గొని విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందచేసారు. 

రైతుబ్రతుకు చిత్రంపై సంక్రాంతి ముగ్గుల పోటీలు

లక్ష్మణచాంద, జనవరి 13 : రైతుబ్రతుకు చిత్రంపై మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహిం చారు. ఒక ఎరువుల కంపెనీ, తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌లు సంయుక్తంగా నిర్వహించిన ఈ పోటీలలో స్థానిక మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. రైతు బ్రతుకు చిత్రపైం వేసిన పలు రంగవల్లులు బహుమతులు గెలుచుకున్నాయి. గ్రోమోర్‌ తరపున మొదటిబహుమతిని మాధురి అందుకోగా, రెండవ బహు మతిని భూమలక్ష్మీ, మూడవ బహుమతిని వలన్మి అందుకున్నారు. తెలంగాణ గ్రామీ బ్యాంక్‌ తరపున మొదటి బహుమతి కావ్య అందుకోగా, రెండవ బహుమతిని లత, మూడవ బహుమతిని రచన అందుకున్నారు. ఈ పోటీలలో గెలిచిన మహిళామణులను తెలంగాణ జాగృతి జిల్లా కన్వీనర్‌ ఈటెల కవిత శ్రీనివాస్‌ అభినందించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ఓస రాజేశ్వర్‌, వ్యవసాయ అధికారి ప్రవీణ్‌ కుమార్‌, టీజీబీ మేనేజర్‌ వీఎల్‌ నరసింహ రావు, టీఆర్‌ఎస్‌ యువజన మండలాధ్యక్షుడు శ్రీను, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-14T05:22:51+05:30 IST