సకలాభీష్ట సిద్ధికి...

ABN , First Publish Date - 2020-07-24T05:30:00+05:30 IST

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు, కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుడు. సకల దేవతలతో పూజలందుకుంటున్న ఆ స్వామిని సృష్టికర్త అయిన బ్రహ్మ స్తుతిస్తూ...

సకలాభీష్ట సిద్ధికి...

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు, కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుడు. సకల దేవతలతో పూజలందుకుంటున్న ఆ స్వామిని సృష్టికర్త అయిన బ్రహ్మ స్తుతిస్తూ, నారద మహర్షికి చెప్పిన స్తోత్రం ‘శ్రీ వేంకటేశ ద్వాదశనామ స్తోత్రం’. బ్రహ్మాండపురాణంలో అంతర్భాగమైన ఈ స్తోత్రం సకలాభీష్టదాయకమని చెబుతారు.


శ్రీవేంకటేశ ద్వాదశనామ స్తోత్రం

అస్య శ్రీవేంకటేశ ద్వాదశనామ స్తోత్ర మహామంత్రస్య, 

బ్రహ్మా ఋషిః, అనుష్టుప్‌ ఛందః 

శ్రీవేంకటేశ్వరో దేవతా ఇష్టార్థే వినియోగః

నారాయణో జగన్నాథో వారిజాసన వందితః

స్వామి పుష్కరణీవాసీ శంఖ చక్ర గదాధరః (1)

పీతాంబరధరో దేవో గరుడాసన శోభితః

కందర్పకోటి లావణ్యః కమలాయత లోచనః (2)

ఇందిరాపతి గోవిందః చంద్ర సూర్య ప్రభాకరః

విశ్వాత్మా విశ్వలోకేశో జయ శ్రీవేంకటేశ్వరః (3)

ఏతద్ద్వాదశ నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః

దారిద్య దుఃఖ నిర్ముక్తో ధనధాన్య సమృద్ధిమాన్‌ (4)

జనవశ్యం రాజవశ్యం సర్వకామార్థసిద్ధిదమ్‌

దివ్యతేజః సమాప్నోతి దీర్ఘమాయుశ్చ విందతి (5)

గ్రహరోగాది నాశం చ కామితార్థ ఫలప్రదమ్‌

ఇహ జన్మని సౌఖ్యం చ విష్ణు సాయుజ్యమాప్నుయాత్‌

ఇతి బ్రహ్మాండపురాణే బ్రహ్మ నారద సంవాదే శ్రీవేంకటేశ ద్వాదశనామ స్తోత్రం సంపూర్ణం


రోజూ త్రిసంధ్యల్లో ఈ స్తోత్రాన్ని నిష్ఠగా పఠించిన వారు దారిద్య్రం నుంచి విముక్తులవుతారు. ధనధాన్య సమృద్ధి కలుగుతుంది. కోరిన కోరికలు సిద్ధిస్తాయి. గ్రహపీడలూ, రోగాలూ నాశనమవుతాయి. సౌఖ్యప్రదమైన జీవితం లభిస్తుంది- అని పెద్దల మాట.

Updated Date - 2020-07-24T05:30:00+05:30 IST