తెలంగాణ ఇంజనీర్ల పనితనం ప్రపంచానికి తెలిసింది: Enc krupakar reddy

ABN , First Publish Date - 2022-06-02T22:17:34+05:30 IST

మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టులతో తెలంగాణ ఇంజనీర్ల పనితనం ప్రపంచానికి తెలిసిందన్నారు మిషన్ భగీరథ ఈ.ఎన్.సి కృపాకర్ రెడ్డి (krupakar reddy) అన్నారు.

తెలంగాణ ఇంజనీర్ల పనితనం ప్రపంచానికి తెలిసింది: Enc  krupakar reddy

హైదరాబాద్: మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టులతో తెలంగాణ ఇంజనీర్ల పనితనం ప్రపంచానికి తెలిసిందన్నారు మిషన్ భగీరథ ఈ.ఎన్.సి కృపాకర్ రెడ్డి (krupakar reddy) అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ (kcr)నాయకత్వంలో యావత్ దేశానికి తెలంగాణ రోల్ మోడల్ గా నిలిచిందన్నారు. హైదరాబాద్ ఎర్రమంజిల్ లోని పంచాయితీరాజ్-మిషన్ భగీరథ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో కృపాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ పునర్నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర మరువలేనిదన్నారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, పట్టణాలకు రోడ్ కనెక్టివిటీ ఏర్పడడంలో పంచాయితీరాజ్ ఇంజనీర్ల  కృషి ఎంతో ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇస్తున్న ప్రోత్సాహం, ప్రాధాన్యతతో తెలంగాణ ఇంజనీర్లు అద్భుతాలు చేస్తున్నారని  చెప్పారు. 


ప్రజలకు మంచి చేయడమే ప్రథమ ప్రాధాన్యతగా పెట్టుకోవాలని యువ ఇంజనీర్లుకు సూచించారు. పంచాయితీరాజ్ ఈ.ఎన్.సి సంజీవరావు(sanjeeva rao) మాట్లాడుతూ ఒకప్పుడు గ్రామాల్లో తాగడానికి గుక్కెడు మంచినీళ్లు కూడా దొరికేవి కావన్నారు. ప్రతీ ఒక్కరికి పరిశుభ్రమైన తాగునీరు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పాన్ని మిషన్ భగీరథ ఇంజనీర్లు సాకారం చేశారని ప్రశంసించారు. తెలంగాణలో రోడ్ కనెక్టివిటీ లేని ఊరు లేదని ఇందుకు కోసం పంచాయితీరాజ్ ఇంజనీర్లు, అధికారులకు పగలు, రాత్రి తేడా లేకుండా పనిచేశారన్నారు. ప్రతీ ఒక్కరు తెలంగాణ సమగ్రాభివృద్ధి కోసం పనిచేయాలని కోరారు. అంతకుముందు జాతీయజెండాను పంచాయితీరాజ్ ఈ.ఎన్.సి సంజీవరావు ఎగురవేశారు. ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భగీరథ , పంచాయితీరాజ్ ఉన్నతాధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-02T22:17:34+05:30 IST