Abn logo
Mar 3 2021 @ 23:45PM

సూళ్లూరుపేటలో 14 వార్డుల ఏకగ్రీవం

సూళ్లూరుపేట, మార్చి 3 : ఎట్టకేలకు సూళ్లూరుపేట మున్సిపాలిటీని వైసీపీ కైవశం చేసుకుంది. ఇక్కడ 25 వార్డులు ఉండగా, 14 వార్డుల్లో  ఏకగ్రీవం చేసుకొని చైర్మన్‌ స్థానానికి కావాల్సిన మ్యాజిక్‌ ఫిగర్‌ 13కు ఒకటి అధికం గానే  వైసీపీ సాధించుకుంది. ఈ మున్సిపాలిటీ లో 25 వార్డులకు 121 మంది నామినేషన్లు దాఖలు చేశారు. మంగళ, బుధవారాలలో 77 మంది ఉపసంహరించుకున్నారు. ఏకగ్రీవం అ యిన 14 వార్డులు పోగా, ఇద్దరు వైసీపీ అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారు. మిగి లిన 11 వార్డులలో 28 మంది పోటీపడుతు న్నారు. టీడీపీ, బీజేపీలు 8 వార్డుల్లోనే పోటీ చేస్తున్నాయి.బీఎస్‌పీ ఒక వార్డు, జనసేన మూ డు వార్డుల్లో పోటీ చేస్తున్నాయి. వైసీపీ 14 వార్డులు ఏకగ్రీవం చేసుకోగా, మిగిలిన 11 వార్డుల్లో పోటీచేసే ఇతర పార్టీల వారు గెలిచి నా, అధికారపార్టీకి జరిగే నష్టమేమీలేదు. ఈ క్ర మంలో సూళ్లూరుపేట మున్సిపాలిటీని తాము హస్తగతం చేసుకున్నామని బుధవారం రాత్రి ఆ పార్టీ బాణసంచాపేల్చి సంబరాలు చేసుకుంది. 

ఏకగ్రీవమైన వార్డులు : 1, 3, 4, 5, 6,  9, 10, 11, 17, 19,  21, 22, 23, 24 వార్డులలో  వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎనికైనట్లు ఎన్ని కల అధికారులు ప్రకటించారు.

ఎన్నికలు జరుగుతున్న 11 వార్డుల్లో పోటీప డుతున్న పార్టీలు : 2వ వార్డులో : బీజేపీ, టీడీపీ, వైసీపీ, 7వ వార్డులో : టీడీపీ, వైసీపీ, స్వతంత్ర అభ్యర్థి, 8వ వార్డులో : టీడీపీ,  వైసీపీ, బీజేపీ,  బిఎస్‌పి, 12వ వార్డులో : వైసీపీ,  బీజేపీ, 13వ వార్డులో : వైసీపీ, బీజేపీ, 14వ వార్డులో : వైసీపీ, స్వతంత్ర అభ్యర్థి, 15వ వార్డులో : బీజేపీ, వైసీపీ, 16వ వార్డులో : టీడీపీ, వైసీపీ, 18వ వార్డులో : టీడీపీ, వైసీపీ, 20వ వార్డులో :టీడీపీ, వైసీపీ,  బీజేపీ, 25వ వార్డులో : బీజేపీ, టీడీపీ,  వైసీపీలు పోటీ పడుతున్నాయి.

Advertisement
Advertisement
Advertisement