ఆ గుడిసెలు ఖాళీ చేయించండి

ABN , First Publish Date - 2021-10-19T06:20:11+05:30 IST

ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకున్న పేదలను ఖాళీ చేయించాలని ఎమ్మెల్యే మధుసూదన్‌యాదవ్‌ సీఐ పాపారావును ఆదేశించారు. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. అయితే ప్రధానంగా స్పందన కార్యక్రమంలో భూ ఆక్రమణలు, కబ్జాలు పైనే అత్యఽఽధికంగా ఫిర్యాదులు అందాయి. అందులో భాగంగా వెంకటేశ్వరస్వామి దేవసాఽ్ధనం ఎదురు సర్వే నెంబర్‌ 191, 192, 193లో పీసీ కేశవరావు అనే ప్రజాసంఘం నాయకుడు కొంతమందితో అక్రమంగా గుడిసెలు వేయించి కబ్జాకు పాల్పడ్డాడని స్పందన కార్యక్రమంలో బాధితులు ఫిర్యాదు చేశారు.

ఆ గుడిసెలు ఖాళీ చేయించండి
తహసీల్దార్‌ను వారిస్తున్న ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌యాదవ్‌

 - సీఐ పాపారావుకు ఎమ్మెల్యే ఆదేశం

 కనిగిరి, అక్టోబరు 18: ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకున్న పేదలను ఖాళీ చేయించాలని ఎమ్మెల్యే మధుసూదన్‌యాదవ్‌ సీఐ పాపారావును ఆదేశించారు. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. అయితే ప్రధానంగా స్పందన కార్యక్రమంలో భూ ఆక్రమణలు, కబ్జాలు పైనే అత్యఽఽధికంగా ఫిర్యాదులు అందాయి. అందులో భాగంగా వెంకటేశ్వరస్వామి దేవసాఽ్ధనం ఎదురు సర్వే నెంబర్‌ 191, 192, 193లో పీసీ కేశవరావు అనే ప్రజాసంఘం నాయకుడు కొంతమందితో అక్రమంగా గుడిసెలు వేయించి కబ్జాకు పాల్పడ్డాడని స్పందన కార్యక్రమంలో బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో బాధితులకు, తహసీల్దార్‌కు వాగ్వివాదం జరిగింది. బాధితులు చెబుతున్న 191, 192, 193 లు చుక్కల భూమిగా ఉందని, ఆ భూమిలో తమ ప్రమేయం ఉండదని ఎన్నిమార్లు చెప్పినా తమపై నిందారోపణలు ఎందుకు చేస్తున్నారని తహసీల్దార్‌ బాధితులపై  ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలో ఎమ్మెల్యే కలుగజేసుకుని తహసీల్దార్‌కు సర్దిచెప్పారు. 

  వెంటనే ఖాళీ చేయించండి 

  ప్రభుత్వ భూమిని ఆక్రమించి వేసిన గుడిసెలు తొలగించే చర్యలు  చేపడతానని ఎమ్మెల్యే బాధితులకు హమీ ఇచ్చారు. వెంటనే సీఐ పాపారావును పిలిపించి ఆ గుడిసెలను ఖాళీ చేయించాలని ఆదేశించారు.  

 అన్నీ భూ ఆక్రమణలు, పించన్‌ సమస్యలే 

 ఎమ్మెల్యే నిర్వహించిన స్పందన కార్యక్రమంలో భూ సమస్యలు ఆక్రమణలు, పింఛన్లపైనే ఎక్కువగా అర్జీలు అందాయి. శంఖవరంకు చెందిన ఓ వృద్ధురాలు తనకు పెన్షన్‌ ఇవ్వడం లేదని, భర్త చనిపోయి ఎన్నో ఇబ్బందులు పడుతున్నానని ఎమ్మెల్యే ఎదుట మొర పెట్టుకున్నారు. సమావేశంలో ఉన్న కమిషనర్‌ డీవీఎస్‌ నారాయణరావుకు, చైర్మన్‌ గఫార్‌కు సమస్యను పరిష్కరించాలని సూచించారు. ఈ సమావేశంలో డాక్టర్‌ నాగరాజ్యలక్ష్మీ, వైసీపీ నాయకులు పోతు కొండారెడ్డి, అడ్వకేట్‌ సాల్మన్‌రాజు, బాలసుబ్రమణ్యం, సింగిల్‌విండో చైర్మన్‌ సూరసాని మోహన్‌రెడ్డి, జడ్పీటీసీ మడతల కస్తూరిరెడ్డి, వెంకటరెడ్డి, రంగనాయకులరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అయితే స్పందన నిర్వహిస్తున్న ఎమ్మెల్యే తహసీల్దార్‌ సీట్లో కూర్చొవడాన్ని పలువురు తప్పు బడుతున్నారు.

Updated Date - 2021-10-19T06:20:11+05:30 IST