ఖాళీ సీట్లు.. కృత్రిమ జేజేలు!

ABN , First Publish Date - 2021-05-11T09:19:33+05:30 IST

ఖాళీ స్డేడియం.. పరుగు తీస్తున్న అథ్లెట్ల బూట్ల శబ్దం కూడా వినిపించేంత నిశ్శబ్దం.. కానీ పోటీ పూర్తయ్యాక మాత్రం చెవులు చిల్లులుపడేలా ఫ్యాన్స్‌ జేజేలు.. ఇదీ ఒలింపిక్స్‌ టెస్ట్‌ ఈవెంట్ల సందర్భంగా

ఖాళీ సీట్లు.. కృత్రిమ జేజేలు!

టోక్యో: ఖాళీ స్డేడియం.. పరుగు తీస్తున్న అథ్లెట్ల బూట్ల శబ్దం కూడా వినిపించేంత నిశ్శబ్దం.. కానీ పోటీ పూర్తయ్యాక మాత్రం చెవులు చిల్లులుపడేలా ఫ్యాన్స్‌ జేజేలు.. ఇదీ ఒలింపిక్స్‌ టెస్ట్‌ ఈవెంట్ల సందర్భంగా 68వేలమంది సామర్థ్యం కలిగిన టోక్యో స్టేడియంలో కనిపించిన దృశ్యాలు. ఈ వాతావరణం అథ్లెట్లకు ఇబ్బందిగానే అనిపించిందట. ‘ప్రేక్షకులులేని స్టేడియంలో పోటీపడడం అసహజంగా ఉంది’ అని 100 మీ. స్ర్పింట్‌ అనంతరం అమెరికా స్టార్‌ జస్టిన్‌ గాట్లిన్‌ వ్యాఖ్యానించాడు. ‘ఇది ఎలా ఉందంటే..ఎంపికలకోసం జట్ల మధ్య జరిగే రేస్‌లా ఉంది’ అని అన్నాడు.


ఆదివారం జరిగిన టెస్ట్‌ ఈవెంట్లలో 400మంది క్రీడాకారులు తలపడగా, వీరిలో విదేశీ అథ్లెట్లు కేవలం 9మందే ఉండడం గమనార్హం. మొత్తంగా..జూలై 23 నుంచి ఒలింపిక్స్‌ కనుక జరిగితే దాదాపు ఖాళీ స్టేడియాల్లోనే పోటీలు నిర్వహిస్తారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విశ్వక్రీడలకు విదేశీ ఫ్యాన్స్‌ను నిషేధిస్తూ నిర్వాహక కమిటీ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఇక జపాన్‌ ప్రజలను స్టేడియాల్లోకి అనుమతించే విషయమై వచ్చే నెలలో నిర్ణయం ప్రకటించనుంది. 

Updated Date - 2021-05-11T09:19:33+05:30 IST