స్వీయ ఆలోచనలతో సాధికారిత

ABN , First Publish Date - 2022-01-25T05:56:21+05:30 IST

బాలికలు స్వయంగా ఆలోచనా శక్తి పెంచు కొని సాధికారిత వైపు అడుగులు వేయాలని జిల్లా సంక్షేమ అధికారి విజయలక్ష్మి సూచించారు.

స్వీయ ఆలోచనలతో సాధికారిత
మాట్లాడుతున్న జిల్లా అధికారి

నిర్మల్‌ కల్చరల్‌, జనవరి 24 : బాలికలు స్వయంగా ఆలోచనా శక్తి పెంచు కొని సాధికారిత వైపు అడుగులు వేయాలని జిల్లా సంక్షేమ అధికారి విజయలక్ష్మి సూచించారు. సోమవారం జాతీయ బాలికా దినోత్సవము సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రాజ్యాంగం మహిళలకు కల్పించిన హ క్కులు వినియోగించుకోవాలన్నారు. చదువుతోనే ఇది సాధ్యమవుతుందని అన్నా రు. 18 ఏళ్లలోపు బాలికల సంరక్షణకు ప్రత్యేకరక్షణ కమిటీ ఉందన్నారు. బాలల రక్షణ అధికారి దేవి మురళి, కమిటీ సభ్యులు జున్ను అనిల్‌, శ్రీలత, సైమన్‌ సుందర్‌, స్వదేశ్‌, సగ్గం రాజు, శైలజ, అనిల్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు. 

లక్ష్మణచాంద : జాతీయ బాలికాదినోత్సవాన్ని ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో సోమ వారం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. మండలంలోని ఆయా గ్రామా ల్లో గల అంగన్‌వాడీ ఉపాధ్యాయులతో ప్రత్యేకసమావేశం ఏర్పాటు చేసి ఈ దినోత్సవము జరుపుకున్నారు. ఈ సందర్భంగా బాలికల హక్కులను, రక్షణ చట్టాలను తెలిపారు. అందరూ కలిసి ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఐసీడీ ఎస్‌ సూపర్‌వైజర్‌ భాగ్యవతి, అంగన్‌వాడీ ఉపాధ్యాయులు, హెల్పర్లు, బాలికలు పాల్గొన్నారు. 

తానూర్‌ : మండలంలోని మొగిలి, దహగాం గ్రామంలో జాతీయ బాలికల దినోత్సవ కార్యక్రమాన్ని ఘనం గా నిర్వహించారు. ఈ సంద ర్భంగా భేటీబచావో, భేటీపడా వో ప్రతిజ్ఞలు చేశారు. కార్య క్రమంలో సర్పంచ్‌లు పుండలి క్‌, సావిత్రీబాయి సాయినాథ్‌, ఎంపీటీసీ సిర్మోల్ల లక్ష్మణ్‌, తదితరులున్నారు.

Updated Date - 2022-01-25T05:56:21+05:30 IST