ఉపాధి కూలీలకు అత్యధిక పనిదినాలు కల్పించాలి

ABN , First Publish Date - 2022-05-19T05:01:54+05:30 IST

జిల్లాలో ఉపాదికూలీలకు అత్యధిక పనిదినాలు కల్పించాలని బాపట్ల జిల్లా కలెక్టర్‌ విజయ్‌కృష్ణన్‌ అధికారులను ఆదేశించారు. సంతమాగులూరు మండలం చవిటిపాలెం గ్రామంలో మంగళవారం రాత్రి పల్లె కార్యక్రమంలో కలెక్టర్‌ పాల్గొని ఆ గ్రామంలోనే నిద్రించారు. బుధవారం ఉదయం గ్రామంలోని వీధులలో తిరుగుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పఽథకాలు గురించి ప్రజలను నేరుగా అడిగి తెలుసుకున్నారు.

ఉపాధి కూలీలకు అత్యధిక పనిదినాలు కల్పించాలి
చవిటిపాలెం గ్రామ ప్రజలతో మాట్లాడుతున్న కలెక్టర్‌ విజయ్‌కృష్ణన్‌

కలెక్టర్‌ విజయ్‌కృష్ణన్‌

సంతమాగులూరు, మే 18: జిల్లాలో ఉపాదికూలీలకు అత్యధిక పనిదినాలు కల్పించాలని బాపట్ల జిల్లా కలెక్టర్‌ విజయ్‌కృష్ణన్‌ అధికారులను ఆదేశించారు. సంతమాగులూరు మండలం చవిటిపాలెం గ్రామంలో మంగళవారం రాత్రి పల్లె కార్యక్రమంలో కలెక్టర్‌ పాల్గొని ఆ గ్రామంలోనే నిద్రించారు. బుధవారం ఉదయం గ్రామంలోని వీధులలో తిరుగుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పఽథకాలు  గురించి ప్రజలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ కె. శ్రీనివాసులు, చీరాల ఆర్‌డీవో పి. సరోజిని, డీపీవో శంకరరావు, జిల్లా గృహనిర్మాణ శాఖ అధికారి ప్రసాద్‌, డీఆర్‌డీఏ పీడీ సత్యసాయి, డ్వామా పీడీ ఉషారాణి, తహసీల్దార్‌ పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-19T05:01:54+05:30 IST