ఉపాధి పనులు ముమ్మరంగా చేపట్టాలి

ABN , First Publish Date - 2020-05-23T09:53:27+05:30 IST

ఉపాధి పనులు ముమ్మరంగా చేపట్టి కూలీలకు రోజు వారి కూలీ 237రూపాయలు వచ్చేటట్లు పనిచేయించాలని కలెక్టర్‌ కె.శశాంక అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీవోలు,

ఉపాధి పనులు ముమ్మరంగా చేపట్టాలి

కలెక్టర్‌ కె శశాంక


కరీంనగర్‌, మే 22 (ఆంధ్రజ్యోతి, ప్రతినిధి): ఉపాధి పనులు ముమ్మరంగా చేపట్టి కూలీలకు రోజు వారి కూలీ 237రూపాయలు వచ్చేటట్లు పనిచేయించాలని కలెక్టర్‌ కె.శశాంక అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీవోలు, పంచాయతీ కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రతి మండలంలో పనిచేయాల్సిన పని దినాలను మున్సిపల్‌ కమిషనర్‌ ఇచ్చారన్నారు. పని దినాలను పూర్తిచేయాల్సిన దానిలో జిల్లాలో యావరేజ్‌కన్నా తక్కువగా ఉన్న మండలాలు తిమ్మాపూర్‌, గంగాధర, కొత్తపల్లి, రామడుగు, కరీంనగర్‌, ఇల్లందకుంట, జమ్మికుంట మండలాలు రోజుకు 200మంది కూలీలతో పనిచేయించాల్సిన బాధ్యత పంచాయతీ సెక్రెటరీలదే అని అన్నారు. వలస కూలీలకు జాబ్‌కార్డులను జారీచేసి వారికి పనికల్పించాలని అన్నారు.


పనికి వచ్చిన కూలీలకు వారి బ్యాచ్‌ ప్రకారం మూడు రోజుల లోపు పేమెంట్‌ చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌, జడ్పీ సీఈవో వెంకటమాధవరావు, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి వెంకటేశ్వర్‌రావు, జిల్లా పంచాయతీ అధికారి రఘువరన్‌, ఏపీడీ మంజులదేవి, పంచాయతీ సెక్రెటరీలు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-23T09:53:27+05:30 IST