Abn logo
Sep 25 2021 @ 23:42PM

ఉపాధి పనులు భేష్‌

జి.సిగడాం: ఉపాధి పనుల రికార్డులను పరిశీలిస్తున్న కేంద్రబృందం

లావేరు: ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న పనులు బాగున్నాయని కేంద్ర బృంద సభ్యులు ఎం.కె.గోయిల్‌, ఆనంద్‌కుమార్‌లు తెలిపారు. బెజ్జిపురం దేవులవాని చెరువులో చేపట్టిన ఉపాధి పనులను వారు శనివారం పరిశీలించా రు. ఈ చెరువులో 2019-20 ఆర్థిక సంత్సరంలో సుమారు రూ.29,99,367  వ్యయంతో పనులు చేపట్టారు. ఈ పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్ర మంలో  డ్వామా పీడీ హనుమంతు కూర్మారావు, ఏపీడీలు శైలజ, రామారావు, లవరాజు, ఏపీవో ఆర్‌.సత్యవతి, జేఈ లెలిన్‌బాబు టీఏలు రత్నాకర్‌, గౌరినాయుడు, ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.ఫ జి.సిగడాం: వెలగాడ, వెంకయ్యపేటల్లో కేంద్ర బృందం శనివారం పర్యటించింది. ఎన్‌ఆర్‌జీసీఎస్‌ ద్వారా చేపట్టిన వివిధ పనుల నాణ్యతను పరిశీలించింది.  కేంద్ర బృంద సభ్యుడు అర్యివార్‌,  ఎంపీడీవో పంచాది రాధ, ఏపీడీలు శైలజ, రామారావు, బిపీటీ విజయవాణి, ఏపీవో సీహెచ్‌ సత్యనా రాయణ, ఈసీ పురుషోత్తమరావు ఉపాది సిబ్బంది పాల్గొన్నారు.