Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రజలు, రైతులకు ఉపయోగపడేలా ఉపాధి పనులుండాలి

వీరులపాడు, డిసెంబరు 8 : ఉపాధిహామీ పథకం కింద చేపట్టే ప్రతీ పని ప్రజలకు, రైతులకు ఉపయోగపడే విధంగా ఉండాలని రాష్ట్ర వాటర్‌ షెడ్‌ డైరెక్టర్‌ పి.వి.ఆర్‌.ఎం.రెడ్డి, శానిటేషన్‌ డిప్యూటీ కమిషనర్‌ భవానీలు అన్నారు.  జగన్నాథపురం, గోకరాజుపల్లిల్లో 2020-21 సంవత్సరానికి ఉపాధిహామీ కింద చేపట్టిన పంటకాల్వల్లో పూడికతీత, మొక్కలపెంపకం, చెక్‌డ్యామ్‌ నిర్మాణ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో డ్వామా డైరెక్టర్‌ సూర్యనారాయణ, ఏపీడీ శ్రీనివాసరావు, ఎంపీడీవో రామకృష్ణ నాయక్‌, ఏపీవో జనార్థన్‌ పాల్గొన్నారు. 


Advertisement
Advertisement