Abn logo
Jul 9 2020 @ 05:12AM

గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికే ‘ఉపాధి’ పనులు

 కలెక్టర్‌ భారతి హోళికేరీ


కాసిపేట, జూలై 8: గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఉపాధి హామీ పను లను ప్రోత్సహిస్తున్నామని కలెక్టర్‌ భారతి హోళికేరీ అన్నారు. బుధవారం కాసిపే ట మండల పరిషత్‌ కార్యాలయంలో సర్పంచ్‌లు, కార్యదర్శులతో నిర్వహించిన స మీక్ష సమావేశానికి హాజరై ఆమె మాట్లాడారు. 


కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రభు త్వాలు లాక్‌డౌన్‌ విధించడంతో గ్రామీణులు ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారని, దీన్ని దృష్టిలో ఉంచుకుని ఉపాధిహామీ పనులను కల్పిస్తున్నామన్నారు. అర్హులైన కూలీలకు పనులు కల్పించాల్సిన బాధ్యత సర్పంచ్‌లు, కార్యదర్శులపై ఉందన్నారు. ఉపాధిహామీ పనుల్లో సోనాపూర్‌ గ్రామపంచాయతీ అత్యధిక పనిదినాలతో పాటు ఎక్కువ మంది కూలీకు పనులు కల్పించి జిల్లాలోనే మొదటి స్థానంలో నిలిచింద న్నారు. సర్పంచ్‌ కోట్నాక సరస్వతి, కార్యదర్శి కవితను కలెక్టర్‌ అభినందించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శ్మశాన వాటిక నిర్మాణ పనుల్లో 22 పంచాయతీలకు గాను 13 పంచాయతీల్లో ఎలాంటి పురోగతి లేదన్నారు.  


 సమావేశం నుంచి సర్పంచ్‌ వాకౌట్‌ 

ఈ నెలాఖరులోగా శ్మశాన వాటికల నిర్మాణాలను పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. పనుల్లో పురోగతి లేకుంటే సర్పంచ్‌లు, కార్యదర్శులకు షోకాజ్‌ నోటీసులు అందజేస్తామని కలెక్టర్‌ హెచ్చరించారు. కోమటిచేను సర్పంచ్‌ శ్రీనివాస్‌ను శ్మశాన వాటిక నిర్మాణంపై జరుగుతున్న ఆలస్యాన్ని కలెక్టర్‌ ప్రశ్నించారు. పని స్థలం వర్షం నీటితో నిండిపోగా పనులకు అంతరాయం జరిగిందని సర్పంచ్‌ తెలిపారు. దీంతో కలెక్టర్‌ సర్పంచ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలను విననప్పుడు సమావేశంలో ఉండడని సర్పంచు శ్రీనివాస్‌ సమావేశం నుంచి వాకౌట్‌ చేశారు. 


 చదువుకు అంగవైకల్యం అడ్డుకారాదు..

చదువుకునేందుకు అంగ వైకల్యం అడ్డుకారాదని కలెక్టర్‌ భారతి హోళికేరీ అ న్నారు. బుధవారం కాసిపేట మండల కేంద్రంలో కోనూరు పంచాయతీకి చెందిన దివ్యాంగుడు చందనగిరి అజయ్‌కి కలెక్టర్‌ ట్రైసైకిల్‌ అందజేశారు. ఈ సందర్భం గా కలెక్టర్‌ మాట్లాడుతూ అంగవైకల్యం శరీరానికే కానీ మనసుకు కాదన్నారు.


గిరిజనులకు సాగు భూములు కేటాయించాలి..

కాసిపేట మండలంలోని బుగ్గగూడెం పంచాయతీలో 27 సర్వే నంబరులో గల 80 ఎకరాల ప్రభుత్వ భూమిని నిరుపేద గిరిజనులకు సాగుభూములకు ఇవ్వా లని కోరుతూ ఆదివాసీ నాయకులు కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. పల్లంగూడ ఉమ్మడి పంచాయతీలో భూమి లేని నిరుపేద గిరిజనులు అధికంగా ఉన్నారని, వ్యవసాయం చేసుకోవడానికి సాగు భూమిని ఇవ్వాలని కలెక్టర్‌ను కోరారు.  ఈ కార్యక్రమాల్లో అడిషనల్‌ కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, డీఆర్‌డీవో శేషాద్రి, డీఎల్‌పీవో ఫణీందర్‌రావు, ఎంపీపీ రొడ్డ లక్ష్మీ, వైస్‌ ఎంపీపీ విక్రమ్‌రావు,  ఎంపీడీవో ఆలీం, తహసీల్దార్‌ భూమేశ్వర్‌, సింగిల్‌ విండో చైర్మన్‌ నీలారాంచందర్‌, సర్పంచ్‌లు, కార్యదర్శులు పాల్గొన్నారు. 


పట్టణ ప్రగతి పనులను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి..

మంచిర్యాల కలెక్టరేట్‌: పట్టణ ప్రగతి కార్యక్రమ నిర్వహణ, పనుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని కలెక్టర్‌ భారతి హొళికేరి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని భవన సముదాయంలో కలెక్టర్‌ చాంబర్‌లో జిల్లా అదనపు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, ట్రైనీ కలెక్టర్‌ కుమార్‌దీపక్‌తో కలిసి మున్సిపల్‌ క మిషనర్‌లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతీ ము న్సిపాలిటీ పరిధిలో ఉన్న స్వచ్ఛ ఆటోలు, పనిచేస్తున్నవి, పారిశుధ్య నిర్వహణ సిబ్బం ది వివరాలతో పాటు అదనంగా కావలసిన సిబ్బంది వివరాలను నమోదు చేయాల న్నారు.


జనాభా ప్రాతిపదికన అవసరమైన వాహనాల కొనుగోలు, ప్రతీ 500 నివాసా లకు ఒక స్వచ్ఛ ఆటోలు ఏర్పాటు చేయాలని, వాటి కొనుగోలు, నిర్వహణ ఖర్చులు ఇ తరత్రా వివరాలు పూర్తి స్థాయిలో నివేదిక తయారు చేసి అందించాలని తెలిపారు. ప్రతీ మున్సిపాలిటీలో ఉన్న పబ్లిక్‌ టాయిలెట్స్‌ వివరాలు, ఇంకా నిర్మాణం అవసరము న్నవి గుర్తించి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. టెండర్లు, ఇతర ప్రక్రియ పూర్తి చేసి ఆగష్టు 15వ తేదీలోగా ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని, వీటి నిర్వహణ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించే వారికి ఇవ్వాలన్నారు. మంచిర్యాల, మందమ ర్రి, చెన్నూర్‌, బెల్లంపల్లి, క్యాతన్‌పల్లి, లక్షెట్టిపేట, నస్పూర్‌ మున్సిపాలిటీ కమిషనర్లు, ఇంజనీరింగ్‌ విభాగం అధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement