ఉపాధి పనులు ఊపందుకోవాలి : డీఆర్డీవో

ABN , First Publish Date - 2022-01-20T04:31:36+05:30 IST

ఉపాధి పనులు అన్నిగ్రామాల్లో కచ్ఛితంగా జరిగేలా పనిచేయాలని, ఇందుకోసం ఉపాధి కూలీలను మోటివేట్‌ చేయాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఎ.శ్రీనివాస్‌ పేర్కొన్నారు.

ఉపాధి పనులు ఊపందుకోవాలి : డీఆర్డీవో
ఉపాధి పనులపై ఈజీఎస్‌ క్లస్టర్‌ సిబ్బందితో సమీక్ష నిర్వహిస్తున్న డీఆర్డీవో శ్రీనివా్‌స

ఆరు మండలాల ఈజీఎస్‌ సిబ్బందితో సమీక్ష

తూప్రాన్‌రూరల్‌, జనవరి 19 : ఉపాధి పనులు అన్నిగ్రామాల్లో కచ్ఛితంగా జరిగేలా పనిచేయాలని, ఇందుకోసం ఉపాధి కూలీలను మోటివేట్‌ చేయాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఎ.శ్రీనివాస్‌ పేర్కొన్నారు. బుధవారం తూప్రాన్‌లో మనోహరాబాద్‌, వెల్దుర్తి, చిన్నశంకరంపేట, చేగుంట,నార్సింగి, తూప్రాన్‌ మండలాల ఈజీఎస్‌ సిబ్బందితో ఉపాధి పనుల పురోగతిపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రతి గ్రామంలో 50 మందికి తక్కువ కాకుండా కూలీలు పనులకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. పనులు పూర్తయిన డంపింగ్‌యార్డులు, వైకుంఠధామాలకు సంబంధించిన బిల్లుల చెల్లింపులను త్వరగా పూర్తిచేయాలన్నారు. హరితహారం కింద నాటిన మొక్కల సంరక్షణపై శ్రద్ధ వహించాలని ఉపాధి సిబ్బందికి సూచించారు. ఈజీఎస్‌ సాఫ్ట్‌వేర్‌ మారుతున్నందున పెండింగ్‌లో ఉన్న ధాన్యం కల్లాలు, పశువుల, గొర్రెల, కోళ్ల షెడ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని తెలిపారు. గ్రామాలవారీగా శ్రమశక్తి సంఘాలతో, క్షేత్రస్థాయిలో పనిచేసే మేట్లకు శిక్షణా తరగతులు నిర్వహించాలని చెప్పారు. ఈ సమావేశంలో ఏపీడీ బాలయ్య, డీఆర్‌పీ సంతోష్‌, జిల్లా ప్లాంటేషన్‌ మేనేజర్‌ శశిరేఖ, హెచ్‌ఆర్‌ రాజేందర్‌రెడ్డి, తూప్రాన్‌ ఎంపీడీవో అరుంధతి, ఏపీఎం సంతో్‌షరెడ్డి, ఆరు మండలాల ఏపీవోలు, టీఏలు, ఈసీలు, సీవోలు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-20T04:31:36+05:30 IST