ఉపాధి కూలి చెల్లించాలి

ABN , First Publish Date - 2021-06-22T05:02:05+05:30 IST

ఉపాధి కూలీలకు ప్రతీ వారం కూలి చెల్లించాలని ఐఎఫ్‌టీయూ జిల్లా కా ర్యదర్శి ప్రసాద్‌ అన్నారు.

ఉపాధి కూలి చెల్లించాలి
పంచాయతీ కార్యదర్శికి వినతి పత్రం ఇస్తున్న ఉపాధి కూలీలు

- మోట్లంపల్లిలో ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో కూలీలు ధర్నా

ఆత్మకూరు, జూన్‌ 21: ఉపాధి కూలీలకు ప్రతీ వారం కూలి చెల్లించాలని ఐఎఫ్‌టీయూ జిల్లా కా ర్యదర్శి ప్రసాద్‌ అన్నారు. మండల పరిధిలోని మోట్లంపల్లి గ్రామంలో ఉపాధి కూలీలతో కలిసి గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ప్రసాద్‌ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో అక్రమాలు జరుగుతున్నా యని ఆరోపించారు. అధికారులు నిర్లక్ష్యం కారణం గా చెల్లింపు విషయంలో అలసత్వం వహిస్తున్నార ని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతుల పొలాల్లో ఉపాధి పనులు చేపట్టాలని కోరారు. అనంతరం పంచాయతీ కార్యదర్శి వెంకటయ్యకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో కూలీలు రవి, వెంక టేష్‌, పాపమ్మ, చెన్నమ్మ, లక్ష్మి పాల్గొన్నారు.

 వీపనగండ్లలో.. 

ఉపాధి కూలీల సమస్యలు పరిష్కరించాలని కేవీపీఎస్‌ నాయకులు కోరారు.  సోమవారం కేవీపీ ఎస్‌ ఆధ్వర్యంలో తహసీల్దార్‌  యేసయ్యకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా  జిల్లా ప్రధా న కార్యదర్శి రాధాకృష్ణ మాట్లాడుతూ షెడ్యూల్డ్‌ కు లాలు, తెగలకు ప్రత్యేక ఫండ్‌ పేరుతో గ్రామాభి వృద్ధి మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశా రు. కూలీలకు కనీస వేతనంగా రూ. 600 ఇవ్వాలని కోరారు. కేవీపీఎస్‌ నాయకులు మురళి,  వెంకటేష్‌, శరత్‌, రాముడు, నవీన్‌ పాల్గొన్నారు.

మదనాపురంలో..

 జాతీయ ఉపాధిహామీ పథకంలో పని చేస్తున్న కూలీలను కులాల వారీగా విభజించి కూలి చెల్లించే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే  విరమించుకో వాలని కేవీపీఎస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. సోమవారం మండల కేంద్రంలో వారు మాట్లాడు తూ షెడ్యూల్డ్‌ తెగలు, షెడ్యూల్డ్‌ కులాలు అను పేరుతో ప్రత్యేక ఫండ్‌ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ విడుదల చేయాలనుకోవడం మూర్ఖత్వమన్నారు. జనరల్‌ పనులకు ఎస్సీ,ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులు మళ్లీంచడం సరికాదని పేర్కొన్నారు. కులాల వారి గా వేతనాలు ఇవ్వాలనుకోవడం చట్ట విరుద్ధ మని, ఇది రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా ఉందని అన్నారు. అనంతరం ఎంపీడీవో నాగేందర్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో కేవీపీఎస్‌ నాయకులు ప్రసాద్‌, వెంకట్‌రాములు, వెంకటేష్‌, చెన్నయ్య, భాస్కర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-06-22T05:02:05+05:30 IST