కూటి కోసం ప్రయాణ పాట్లు

ABN , First Publish Date - 2020-10-31T06:57:13+05:30 IST

కరోనా మహమ్మారి ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేసింది. పొట్టకూటి కోసం మన రాష్ట్రం వచ్చిన వలస కార్మికులు సొంత రాష్ట్రాలకు వెళ్లిపోగా..

కూటి కోసం ప్రయాణ పాట్లు

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి :

కరోనా మహమ్మారి ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేసింది. పొట్టకూటి కోసం మన రాష్ట్రం వచ్చిన వలస కార్మికులు సొంత రాష్ట్రాలకు వెళ్లిపోగా.. అక్కడా ప్రస్తుతం వారికి ఉపాధి కరువైంది. దీంతో కర్ణాటక రాష్ట్రం హుమ్నాబాద్‌ ప్రాంతంలోని మన్నేపల్లి గ్రామానికి చెందిన కూలీలు ఉన్న ఊరిలో పని దొరక్క మూటాముల్లె సర్దుకుని, పిల్లాజెల్లతో పత్తి తెంపేందుకు 80 కిలోమీటర్ల దూరంలోని సంగారెడ్డి జిల్లా సదాశివపేట ప్రాంతానికి శుక్రవారం వచ్చారు. అయితే 15 మంది ప్రయాణించే బొలెరో వాహనంలో ప్రాణాలను సైతం తెక్క చేయకుండా 43 మంది హైవేపై వస్తుండగా ‘ఆంధ్రజ్యోతి’ క్లిక్‌ మనిపించింది. సదాశివపేట ప్రాంతంలో పత్తిని ఎక్కువగా పండిస్తున్నారని తెలిసి వస్తున్నామని, అక్కడికి వెళ్లాక పంట విస్తీర్ణాన్ని చూసి కూలి మాట్లాడుకుంటామని కూలీలు తెలిపారు.

Updated Date - 2020-10-31T06:57:13+05:30 IST