ఉపాధి హామీ కూలీల ధర్నా

ABN , First Publish Date - 2022-05-10T06:02:32+05:30 IST

ఎండను సైతం లెక్కచేయకుండా ఉపాధిహామీ పనులు చేసినప్పటికీ కూలీ డబ్బులు రూ.50 మాత్రమే ఖాతాలో జమ అవుతున్నాయని ఉపాధిహామీ కూలీలు సోమవారం మండల కేంద్రంలో పాతబస్టాండ్‌ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు.

ఉపాధి హామీ కూలీల ధర్నా

దోమకొండ, మే 9: ఎండను సైతం లెక్కచేయకుండా ఉపాధిహామీ పనులు చేసినప్పటికీ కూలీ డబ్బులు రూ.50 మాత్రమే ఖాతాలో జమ అవుతున్నాయని ఉపాధిహామీ కూలీలు సోమవారం మండల కేంద్రంలో పాతబస్టాండ్‌ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు. పనికి వెళ్లకుంటే జాబ్‌కార్డులు తీసేస్తామని పెన్షన్‌లు ఆపుతామని భయపెడుతన్నారని కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కువ ఎండ తీవ్రత ఉన్న సమయంలో సొంత పనులకు బయటకు వెళ్లకుండా ఉన్నామని కానీ పథకాలను ఆపేస్తామనడంతో ఎండలో ఉపాధిహామీ పనికి వెళ్లితే డబ్బులు తక్కు వగా వస్తున్నాయని ధర్నా నిర్వహించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో  బైఠాయించారు. ఎంపీడీవో చిన్నారెడ్డి, ఏపీవో రజనీలు వచ్చి కూలీలకు కొలతలపై వివరించారు. పని చేసిన వారి కొలత ప్రకారమే డబ్బులు వస్తాయని చెప్పారు. గతంలో పార, డగ్గపార, నీటిక అదనంగా ఇక్కరికి రూ. 40 కలిపి వచ్చేవని, ప్రసు ్తతం అట్టి డబ్బులు రావడం లేదని కూలీలకు తెలిపారు. డబ్బులు తక్కువ వచ్చే విషయం తమ పరిధిలో  లేదని కార్యదర్శి సౌజన్య చెప్పారు. వర్క్‌సైడ్‌ వెళ్లి పను ల కొలతల ప్రకారమే మస్టర్‌లో ఎంట్రీ చేస్తున్నామని తెలిపారు. ఎస్సై సుధాకర్‌ సిబ్బందితో అక్కడికి చేరుకుని కూలీలను సముదాయించారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తామని ఎంపీడీవో హామీ ఇవ్వడంతో కూలీలు శాంతించారు. కూలీలకు కాంగ్రెస్‌ నాయకులు అనంత్‌రెడ్డి, స్వామి, మధు, గోపాల్‌రెడ్డి మద్దతు తెలిపారు.

Read more