ఉపాధి సోషల్‌ ఆడిట్‌ డైరెక్టర్‌ భర్తీకి సెర్చ్‌ కమిటీ

ABN , First Publish Date - 2021-04-16T10:26:37+05:30 IST

రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ డైరెక్టర్‌ నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం సెర్చ్‌ కమిటీని నియమించింది.

ఉపాధి సోషల్‌ ఆడిట్‌ డైరెక్టర్‌ భర్తీకి సెర్చ్‌ కమిటీ

అమరావతి, ఏప్రిల్‌ 15(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ డైరెక్టర్‌ నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం సెర్చ్‌ కమిటీని నియమించింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వార్షిక మాస్టర్‌ సర్క్యులర్‌ మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర సోషల్‌ ఆడిట్‌ డైరెక్టర్‌ నియామకానికి సెర్చ్‌ కమిటీ చైర్మన్‌గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేక, ఆయన నియమించిన నామినీ వ్యవహరిస్తారు. ప్రిన్సిపల్‌ అకౌంటెంట్‌ జనరల్‌ లేక స్థానిక సంస్థల అకౌంటెంట్‌ జనరల్‌ ఇన్‌చార్జి, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సివిల్‌ సొసైటీ ప్రతినిధి, కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ ప్రతినిధి సభ్యులుగా ఉంటారు.

Updated Date - 2021-04-16T10:26:37+05:30 IST