రూ.129.58 కోట్లు మిగిలిపోయాయ్‌!

ABN , First Publish Date - 2020-05-24T08:54:06+05:30 IST

ఉపాధి హామీ పథకం ద్వారా కన్వెర్జెన్సీ పనుల కు ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరం కేటాయించిన నిధుల్లో ఏకంగా ..

రూ.129.58 కోట్లు మిగిలిపోయాయ్‌!

ఖర్చుకు అదనపు గడువివ్వండి

రాష్ట్ర పీఆర్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌కు కలెక్టర్‌ లేఖ


అనంతపురం, మే23(ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పథకం ద్వారా కన్వెర్జెన్సీ పనుల కు ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరం కేటాయించిన నిధుల్లో ఏకంగా రూ.129.58 కోట్లు మిగిలిపోయాయి. లాక్‌డౌన్‌ తదితర కారణాలతో నిధులు మిగిలిపోయాయనీ, వాటిని ప్రస్తుత ఆర్థిక సం వత్సరంలో ఖర్చు చేసుకునేలా అదన పు గడువివ్వాలని రాష్ట్ర పీఆర్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌కు కలెక్టర్‌ గంధం చంద్రుడు శనివారం లేఖ రాశారు. గతేడాది మొత్తంగా ప్రభుత్వం రూ.309 కోట్లు కేటాయించింది.


జిల్లా లో వివిధ శాఖల ద్వారా చేపట్టిన కన్వర్జెన్సీ పనులకు రూ.179.42 కోట్లు ఖర్చు చేశామని కలెక్టర్‌ తెలిపారు. 2019-20 ఆర్థిక సంవత్సరం ముగియటంతోపాటు లాక్‌డౌన్‌ తదితర కారణాలతో రూ.129.58 కోట్లు ఖర్చు చేయలేక పోయామన్నారు. మార్చిలో కీలకమైన చివరి పది రోజుల్లో పనులు చేపట్టలేకపోయా మన్నారు. జాతీయ విపత్తు, ఇతర కారణాల దృష్ట్యా 2019-20 ఆర్థిక సంవత్సరం ముగియ ుటంతో మిగిలిపోయిన రూ.129.58 కోట్లను ఖర్చు చేసేందుకు లాక్‌డౌన్‌ ముగిసే తేదీ నుంచి అదనంగా నెలపాటు గడువివ్వాలని కోరారు.

Updated Date - 2020-05-24T08:54:06+05:30 IST