Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఉత్తుత్తి హామీలపై గళమెత్తిన ఉద్యోగులు

గుంతకల్లు టౌన, డిసెంబరు7: ఉత్తుత్తి హామీలతో మోసగిస్తున్న వైసీపీ ప్రభుత్వ తీరుపై ప్రభుత్వ ఉద్యోగులు గళమెత్తారు. పీఆర్సీ అమలు, డీఏ విడుదల, సీపీఎస్‌ రద్దు, పీఎఫ్‌ రుణాల మంజూరు తదితర ఉద్యోగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం జిల్లావ్యాప్తంగా ఆందోళనకు దిగారు. ప్రతిపక్ష నేతగా జగన పాదయాత్రలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని నినదించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై, ప్రభుత్వ కార్యాలయాల ఎ దుట నిరసన చేపట్టారు. ప్రభుత్వం దిగిరాకపోతే దశలవా రీ ఉద్యమ కార్యాచరణను ఉధృతం చేస్తామని హెచ్చరిం చారు. అందులో భాగంగా మంగళవారం గుంతకల్లు ప్రభు త్వ ఆసుపత్రి సిబ్బంది నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఏపీఎన్జీఓ అధ్యక్షుడు ఫయాజ్‌ మాట్లాడుతూ 11వ పీఆర్సీ నివేదిక ఇవ్వాలన్నారు. డీఏ విడుదల, సీపీఎస్‌ ర ద్దు, పీఎఫ్‌ రుణాల మంజూరు తదితర ఉద్యోగ సమస్యల ను వెంటనే పరిష్కరించాలన్నారు. నిరసనలో వైద్య సిబ్బం ది సులోచన, రాజ్‌కుమారి, సంపూర్ణ పాల్గొన్నారు. అలాగే తహసీల్దారు సిబ్బంది 11వ పీఆర్సీని విడుదల చేయాలని నిరసన చేపట్టారు. నిరసనలో సీఎ్‌సడీటీ సుబ్బలక్ష్మి, ఆర్‌ఐ లు, వీఆర్వోలు పాల్గొన్నారు.


గుత్తి: పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ఉ ద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. డీఏ, అ రియర్స్‌ చెల్లించాలని, పీఆర్సీని ప్రకటించాలని డిమాండ్‌ చే శారు. నిరసనలో మున్సిపల్‌ అధికారులు ఎర్రిస్వామి, సతీ ష్‌, చంద్ర, మహేష్‌, ఇమామ్‌ హుసేన పాల్గొన్నారు.


పామిడి: మండలంలోని పీ కొండాపురం ఎంపీయూపీఎస్‌ పాఠశాలలో ఉపాధ్యాయులు రాష్ట్ర ప్రభుత్వ విధానా లపై నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. సీపీఎస్‌ ర ద్దు, పీఆర్సీ అమలు చేయాలని ఉపాధ్యాయుడు వెంకటరమణ పేర్కొన్నారు.నిరసనలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


విడపనకల్లు: స్థానిక తహసీల్దారు కార్యాలయం ఎదు ట తహసీల్దారు  కార్యాలయ సిబ్బంది, మండల ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. పెండిగ్‌ డీఏలను వెంటనే మంజూరు చేయాలన్నారు. ఉద్యోగుల స మస్యలు పరిష్కరించాలన్నారు. నిరసనలో మండల ఉపాధ్యాయులు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


కూడేరు: ప్రభుత్వం తక్షణమే పీఆర్సీని అమలు చేసి, సీ పీఎ్‌సను రద్దు చేయాలని రెవెన్యూ ఉద్యోగులు నిరసనకు దిగారు. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయ ఉద్యోగులు కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. నిరసనలో ఆర్‌ఐ శర్మ, వీఆర్వోలు డీఎల్‌ఎన చౌదరి, నాగరాజు, బాషా, ఓబులేసు, సేతు మాధవ్‌ పాల్గొన్నారు.


ఉరవకొండ: పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్‌ చే స్తూ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి తహసీల్దారు కార్యాల యం ఎదుట నిరసన తెలిపారు. పీఆర్సీ అమలు సహా 71 డిమాండ్లను అమలు చేయాలన్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే వరకూ ఆందోళన చేపడతామన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. నిరసనలో తహసీల్దారు మునివేలు, డీటీ మధుసూధన రావు, సీఎ్‌సడీటీ రమేష్‌, ఆర్‌ఐ చంద్రశేఖర్‌, జయమ్మ పాల్గొన్నారు. 


కళ్యాణదుర్గం: ఉద్యోగుల పట్ల ప్రభుత్వ మోసపూరిత వాగ్దానాలను ఎండగట్టేందుకు దశలవారిగా ఉద్యమిస్తామ ని జేఏసీ తాలుకా అధ్యక్షుడు మాధవ్‌, జనరల్‌ సెక్రెటరీ రా యల్‌ వెంకటేశులు హెచ్చరించారు. స్థానిక తహసీల్దార్‌ కా ర్యాలయం వద్ద నిరసన చేపట్టారు. వైసీపీ ప్రభుత్వం ఏ ర్పాటై రెండున్నరేళ్లు పూర్తికావస్తున్నా ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మిక, పెన్షనర్లకు సంబంధించిన ఏఒక్క సమస్య కూడా పరిష్కారానికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభు త్వ వైఫల్యాలను నిరసిస్తూ ఈనెల 13న భారీ ర్యాలీ, 16న ధర్నా నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. నిరసనలో నాయకు లు ఈశ్వరయ్య, బొమ్మయ్య, మల్లికార్జున గౌడ్‌, నరసింహు లు, చెన్నారెడ్డి, హరిప్రసాద్‌, కుల్లాయప్ప, చిత్తయ్య, తిమ్మ ప్ప, నాగేంద్ర పాల్గొన్నారు. విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తామని సంఘం అధ్యక్షుడు శివప్రసాద్‌ హెచ్చరించారు. కళ్యాణదుర్గం విశ్రాంత ఉద్యోగుల భవనం వద్ద నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. నిరసనలో విశ్రాంత ఉద్యోగులు మారెన్న, అంజినప్ప, సీసీరెడ్డి, ఫకృద్దీన, లింగప్ప, వెంకటలక్ష్మయ్య, భగవానదా్‌స, పాలనాయక్‌, రామాంజినేయులు, బసన్న పాల్గొన్నారు. 


యాడికి: మండలంలోని ఉద్యోగ సంఘాల నాయకులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై నిరసన తెలిపారు.  పీఆర్సీ, డీఏలపై ప్రభుత్వ కాలయాపన తగదని, సీపీఎస్‌ ను వెంటనే రద్దు, ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలన్నారు. నిరసనలో ఉపాధ్యాయులు, ఆరోగ్య, ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది ఉన్నారు.


పుట్లూరు: స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట  రె వెన్యూ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. తహసీల్దార్‌ విజయకుమారి మాట్లాడుతూ పీఆర్సీ, సీపీఎస్‌ రద్దు డిమాండ్లు ప్రభుత్వం నెరవేర్చాలన్నారు. రెండేళ్లుగా ఉద్యోగులు కరోనా కష్టకాలంలో ఇబ్బందులు పడుతూ వి ధులు నిర్వహించారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే డిమాండ్లు నెరవేర్చకపోతే భవిష్యత కార్యాచరణ ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నిరసనలో డిప్యూటీ తహసీల్దార్‌ నాగేంద్రప్రసాద్‌, ఆర్‌ఐ విజయలక్ష్మి, వీఆర్వోలు, సిబ్బంది పాల్గొన్నారు.


రాయదుర్గం: పీఆర్సీ అమలు, సీపీఎస్‌ రద్దు, బకాయి పడ్డ ఏడు డీఏల విడుదల తదితర సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు ఉద్యమ బాటపట్టారు. పట్టణంలోని త హసీల్దార్‌, మున్సిపల్‌, అన్ని ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు.  జేఏ సీ చైర్మన లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చడంలో ప్రభుత్వ అలసత్వంపై వివిధ రూపా ల్లో ఆందోళనలు చేపడుతున్నట్లు ప్రకటించారు. 11వ పీఆ ర్సీ అమలు చేయడంలో ప్రభుత్వం తాత్సారం చేస్తోందని మండిపడ్డారు. సీపీఎస్‌ రద్దుకు ప్రభుత్వం ఇచ్చిన హామీ నే టికీ అమలుకాలేదన్నారు. ఏడు డీఏల చెల్లింపులో ప్రభు త్వం మీనమేషాలు లెక్కిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా చొరవ చూపాలని, లేదంటే పెద్దఎత్తున ఉద్యమాలు చేపడతామన్నారు. నిరసనలో డిప్యూటీ తహసీల్దార్‌ సూర్యప్రతాప్‌, ఎన్జీవో అసోసియేట్‌ ప్రెసిడెంట్‌ రామాంజినేయులు, రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయకులు రఘు, ఎ న్జీవో నాయకులు హనుమాన, పరమేశ్వరప్ప పాల్గొన్నారు. 


యల్లనూరు: ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలని స్థానిక జిల్లాపరిషత ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు   నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. పీఆర్‌సీ, డీఏలు, సీపీఎస్‌ రద్దు, కాంట్రాక్ట్‌ ఉద్యోగుల రెగ్యులరైజేషన తదితర డి మాండ్ల సాధనకు ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి ఐ క్యవేదిక పిలుపులో భాగంగా నిరసన తెలిపామన్నారు.


తాడిపత్రి టౌన: ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన పీఆర్‌ సీ అమలు, పెండింగ్‌ డీఏల చెల్లింపు, సీపీఎస్‌ రద్దు తదిత ర హామీలను నిలబెట్టుకోవాలని పట్టణంలో పలు ప్రభుత్వ పాఠశాలల వద్ద ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. నందలపాడు ప్రాథమికోన్నత, బాలుర ఉన్నత పాఠశాల, మండలంలోని బ్రాహ్మణపల్లి ఉన్నత పాఠశాలల వద్ద ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. నిరసనలో ఏపీటీఎఫ్‌ రాష్ట్ర పూ ర్వ అధ్యక్షుడు రఘురామిరెడ్డి, అంకాల్‌యాదవ్‌, రామదాసురెడ్డి పాల్గొన్నారు.


బ్రహ్మసముద్రం: ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయుల స మస్యలు పరిష్కరించాలని కోరుతూ నల్లబ్యాడ్జీలతో వైద్యసిబ్బంది నిరసన తెలిపారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేం ద్రం వద్ద చేపట్టిన నిరసనలో ఉద్యోగులు మాట్లాడారు. పీ ఆర్సీ, కాంట్రాక్టర్‌ ఉద్యోగుల క్రమబద్దీకరణ, సీపీఎస్‌ రద్దు, డీఏలు తదితర 71 డిమాండ్లతో కూడిన సమస్యలను పరిష్కరించాలని పేర్కొన్నారు. నిరసనలో వైద్య సిబ్బంది బా లాజీ, జాన్సన పాల్గొన్నారు.


కుందుర్పి: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కారించాలని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు నిరసన చేపట్టారు. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం వద్ద తహసీల్దార్‌ ఈశ్వరమ్మ, డిప్యూటీ తహసీల్దార్‌ జమానుల్లాఖాన, రె వెన్యూ సిబ్బంది నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు.  అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల ఉపాధ్యాయు లు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. 


శెట్టూరు: కళ్యాణదుర్గం తాలుకా జేఏసీ సెక్రెటరీ జనర ల్‌ రాయల్‌ వెంకటేష్‌ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత ఉ న్నత పాఠశాల ఉపాధ్యాయ బృందం భోజన విరామ సమయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై నిరసన తెలియజేశారు. ఉ ద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యల పట్ల అవలంభిస్తున్న తీరుకు నిరసించారు. నిరసనలో ప్రధానోపాధ్యాయులు సింహం భాస్కర్‌, ఉపాధ్యాయులు దివాకర్‌రెడ్డి, అ శోక్‌, రాజ్‌గోపాల్‌, లాలస్వామి, సోము, ఓబులేష్‌, రవి, అ శ్వర్థ, చలపతి, జీవనబాబు, మంజుల, కల్యాణి, జయలక్ష్మి, గోవిందరాజులు, భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.


Advertisement
Advertisement