అమరావతి: పీఆర్సీ సాధన సమితి సభ్యులే కాకుండా ఏ సంఘం వారు వచ్చినా చర్చలు జరుపుతామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. గురువారం ఆయన మీడియా మాట్లాడుతూ సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం సమ్మె నిషేధమన్నారు. పరిస్థితి చేజారక ముందే చర్చలకు రావాలని సూచించారు. ఉద్యోగులతో చర్చలు జరపడానికి తాము సిద్ధమని స్పష్టం చేశారు. అవసరమైతే నాలుగు మెట్లు దిగడానికైనా సిద్ధమని ప్రకటించారు. చర్చలకు రాకుండా షరతులు పెట్టడం సమంజసం కాదన్నారు. ఎక్కడో కూర్చుని మాట్లాడితే సమస్యకు పరిష్కారం దొరకదని, చర్చలు మినహా ఉద్యోగ సంఘాలకు మరో ప్రత్యామ్నాయం లేదని చెప్పారు. ఒంటెద్దు పోకడలకు పోవొద్దని విజ్ఞప్తి చేస్తున్నామని సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు.
ఇవి కూడా చదవండి