Advertisement
Advertisement
Abn logo
Advertisement

అన్ని కార్యాలయాల్లో నల్లబ్యాడ్జీలు ధరించి విఽధులకు హాజరు

డీఎంహెచఓ కార్యాలయం ముందు నిరసన తెలుపుతున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఏపీ జేఏసీ- ఏపీ జేఏసీ అమరావతి నాయకులు, ఉద్యోగులు

ఉద్యోగుల తిరుగుబావుటా..!

ప్రభుత్వ వైఖరిని ఎండగట్టిన ఐక్యవేదిక నాయకులు

అనంతపురం  వ్యవసాయం, డిసెంబరు 7: తమ సమస్యల పరిష్కారం కోరుతూ ప్రభుత్వోద్యోగులు తిరుగుబావుటా ఎగురవేశారు. పలుమార్లు ప్రభుత్వం, ఆయా శాఖల రాష్ట్ర  ఉన్నతాధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో నిరసన బాట పట్టారు. ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి ఐక్యవేదిక ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా అన్ని ప్ర భుత్వ శాఖల్లో మంగళవారం తొలిరోజు ప్రభుత్వోద్యోగులు, సిబ్బంది నల్లబ్యాడ్జీలు ధరించి, విధులకు హాజరయ్యారు. కలెక్టరేట్‌, ఆర్డీఓ, తహసీల్దార్‌, వైద్య ఆరోగ్య శాఖ, వ్యవసాయ, పశుసంవర్థక, ఏపీఎంఐపీ, ఉద్యాన, ఐసీడీఎస్‌, ఖజానా, ఆ ర్టీసీ, సంక్షేమ, నీటిపారుదల, పంచాయతీరాజ్‌, ప్రభుత్వ పాఠశాలలతోపాటు మిగతా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులంతా నల్లబ్యాడ్జీలు ధరించి, విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీజేఏసీ అమరావతి జిల్లా అధ్యక్షుడు దివాకర్‌రావు, ఏపీజేఏసీ జిల్లా అధ్యక్షుడు అతావుల్లా మాట్లాడుతూ... 11వ పీఆర్సీని వెంటనే ప్రకటించడంతోపాటు డీఏలు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం దారుణమన్నారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోపు సీపీఎ్‌సను రద్దు చేస్తామని హామీ ఇచ్చిన సీఎం జగనమోహనరెడ్డి నేటికీ అ మలు చేయలేదన్నారు. పీఆర్సీ అమలుతోపాటు అందులో పొందుపరచిన ప్రతి సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. కరోనా ఫ్రంట్‌లైన వారియర్స్‌గా ప్రభుత్వోద్యోగులు పని చేస్తూ ఎంతో మంది ప్రాణాలు విడిచారన్నారు. ఉద్యోగుల సంక్షేమ నిధిలోని రూ.1600 కోట్లను ఉద్యోగుల అవసరాలకు కేటాయించాలన్నారు. ఎన్నికలకు ముందు కాంట్రాక్టు ఉ ద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తామని ప్రకటించడంతో సరిపెట్టారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. సమస్యల  పరిష్కారానికి ఈనెల 10వ తే దీ వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో నల్లబ్యాడ్జీలు ధరిం చి, ఉద్యోగులంతా విధులకు హాజరై నిరసన కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈనెల 10వ తేదీన అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద భోజన విరామ సమయంలో నిరసనలు చేపడతామన్నారు. 13వ తేదీన తాలూకా, డివిజన కేంద్రాలు, ఆర్టీసీ బ స్సు డిపోల్లో ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు ఉంటాయన్నారు. 16న అన్ని తాలూకా, డివిజన కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ధర్నాలు చేస్తామన్నారు. 21న కలెక్టరేట్‌ ఎదుట జిల్లాస్థాయిలో ధర్నాకి దిగతామన్నారు. కార్యక్రమాల్లో ప్రభుత్వోద్యోగులు, సిబ్బంది, కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు పాల్గొని, జయప్రదం చేయాలని కోరారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన కార్యక్రమాలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Advertisement
Advertisement