అంబేడ్కర్‌ విగ్రహాలకు ఉద్యోగుల వినతులు

ABN , First Publish Date - 2022-01-27T06:25:14+05:30 IST

ప్రభుత్వం ఇటీవల జారీచేసిన వేతన సవరణ జీవోను వెంటనే రద్దు చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయులు బుధవారం నియోజక వర్గంలోని నాలుగు మండలాల్లో డిమాండ్‌ చేశారు.

అంబేడ్కర్‌ విగ్రహాలకు ఉద్యోగుల వినతులు
నక్కపల్లిలో అంబేడ్కర్‌ విగ్రహానికి వినతి పత్రం సమర్పిస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయులు

పాయకరావుపేట/కోటవురట్ల/నక్కపల్లి, జనవరి 26 : ప్రభుత్వం ఇటీవల జారీచేసిన వేతన సవరణ జీవోను వెంటనే రద్దు చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయులు బుధవారం నియోజక వర్గంలోని నాలుగు మండలాల్లో డిమాండ్‌ చేశారు. ఈ మేరకు నక్కపల్లి తాలూకా పీఆర్‌సీ సాధన సమితి ఆధ్వ ర్యంలో పాయకరావుపేటలో ఆందోళన చేపట్టారు. ఆర్టీసీ బస్టాండ్‌ నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మెయిన్‌ రోడ్డులోని అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రాన్ని అందజేశారు. ఏపీఎన్జీవో నక్కపల్లి తాలూకా అధ్యక్షులు శ్రీనివాసరావుతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు పాల్గొన్నారు. అలాగే, కోటవురట్ల మండలంలో పీఆర్‌సీ సాధన సమితి కోటవురట్ల తాలూకా ఆధ్వర్యంలో కోటవురట్ల శివారు రాట్నాలపాలెంలో  ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపా ధ్యాయులు, కార్మికులు ఆందోళన చేపట్టారు. అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు హరికృష్ణ, డేవిడ్‌, కృష్ణప్రసాద్‌, లచ్చిబాబు, వైద్య సిబ్బంది బి.గోపి, మూర్తి, సీతారామరాజు తదితరులు పాల్గొన్నారు. అలాగే, నక్కపల్లి మండల పరిషత్‌ కార్యాలయం వద్ద ఉన్న అంబేడ్కర్‌ విగ్రహానికి పీఆర్‌సీ సాధన సమితి ప్రతినిధులు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్య క్రమంలో ప్రతినిధులు మజ్జి గణపతిరావు, తోడపు వెంకటరమణ, పీఆర్‌వీఎస్‌ ఆచార్యులు, దాడిశెట్టి కొండలరావు, సీహెచ్‌.అప్పలరాజు, పంపనబోయిన వెం కట్రావ్‌, టి.నానాజీ, బాలాకుమారి, త్రిమూ ర్తులు, ఎం.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-27T06:25:14+05:30 IST