రాజమహేంద్రవరం అర్బన్/సిటీ, జనవరి
26: ‘ఉద్యోగులకు రాజ్యాంగపరమైన రక్షణ, హక్కును వరంగా అందించారు. మీ
స్ఫూర్తితోనే ఉద్యమం చేస్తున్నాం. డాక్టర్ అంబేడ్కరా... మా మొర వినవా’ అని
పీఆర్‌సీ సాధన సమితి నాయకులు విన్నవించుకున్నారు. రాజహేంద్రవరం గోకవరం
బస్టాండు వద్దనున్న బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహానికి బుధవారం వారు
వినతిపత్రం సమర్పించి వినూత్నంగా నిరసన తెలిపారు. కొత్త పీఆర్‌సీ
ఉద్యోగులకు వ్యతిరేకంగా ఉందని, అనేక సార్లు ప్రభుత్వంతో చర్చించిన తర్వాత
విసిగి వేసారి ఉద్యోగులందరూ ఒక్కటై దండుగా కదలి ఉద్యమాన్ని
నిర్మించుకున్నామని చెప్పారు. అం బేడ్కర్ స్ఫూర్తితోనే ఉద్యమంలో
కొనసాగుతున్నామని, ప్రభుత్వానికి మంచి బుద్ధి కలిగించేలా చేయాలని ఆ
వినతిపత్రంలో పేర్కొన్నారు. కార్యక్రమంలో పీఆర్‌సీ సాధన సమితి నాయకులు
డి.వేణుమాధవరావు, మీసాల మాధవరావు, ప్రవీణ్, అనిల్‌కుమార్, వివిధ సంఘాల
నాయకులు మంగతాయారు, నాగమణి, రాజకుమారి, కాంట్రాక్టు ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర
చైర్మన్ ఏవీ నాగేశ్వరరావు, పింఛనుదారుల సంఘం నాయకులు శేషగిరిరావు,
మూర్తిరాజు, పార్వతి, సీఐటీయూ నాయకులు అరుణ్, ఏఐటీయూసీ నాయకులు టి.మధు,
ఎల్‌ఐసీ, ఏపీటీఎఫ్ నాయకులు కె.సత్యనారాయణ, యూటీఎఫ్ నాయకులు రఘుబాబు,
ఎల్‌ఐసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.