ఉద్యోగులు అంకిత భావంతో పనిచేయాలి

ABN , First Publish Date - 2022-01-20T04:30:38+05:30 IST

జిల్లా పరిషత్‌ కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది అంకిత భావంతో పనిచేయాలని జడ్పీ చైర్‌పర్సన్‌ కోవలక్ష్మి అన్నారు. బుధవారం జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ కార్యాల యాలకు ఇటీవల బదిలీపై వచ్చిన ఉద్యోగులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆమెమాట్లాడారు.

ఉద్యోగులు అంకిత భావంతో పనిచేయాలి
పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న జడ్పీ చైర్‌పర్సన్‌ కోవలక్ష్మి

- జడ్పీ చైర్‌పర్సన్‌ కోవలక్ష్మి

ఆసిఫాబాద్‌, జనవరి 19: జిల్లా పరిషత్‌ కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది అంకిత భావంతో పనిచేయాలని జడ్పీ చైర్‌పర్సన్‌ కోవలక్ష్మి అన్నారు. బుధవారం జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ కార్యాల యాలకు ఇటీవల బదిలీపై వచ్చిన ఉద్యోగులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆమెమాట్లాడారు. సిబ్బంది సమన్వ యంతో పనిచేసి జిల్లాఅభివృద్ధికి కృషి చేయాలన్నారు. మండల పరిషత్‌లలో పనిచేస్తున్న సిబ్బంది మండ లాల్లో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్క రించి ప్రజలకు చేరువ కావాలన్నారు. అనంతరం ఉద్యోగులు, సిబ్బంది జడ్పీ చైర్‌పర్సన్‌ కోవలక్ష్మిని సన్మా నించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో రత్నమాల, సూపరింటెండెంట్‌ తోటాజీ, జడ్పీ, మండల పరిషత్‌ కార్యాలయాల సిబ్బంది పాల్గొన్నారు.

పోస్టర్ల ఆవిష్కరణ

కెరమెరి మండలంలోని ఇందాపూర్‌గ్రామంలో నిర్వ హించే పోతరాజు పూజా మహోత్సవానికి సంబంధిం చిన పోస్టర్లను జడ్పీచైర్‌పర్సన్‌ కోవలక్ష్మి ఆవిష్కరిం చారు. ఈనెల 27నుంచి 29వరకు దేవస్థానంలో నిర్వహించే పూజామహోత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Updated Date - 2022-01-20T04:30:38+05:30 IST