Viral News: ఈ కారణంతో ఏ ఉద్యోగీ తన బాస్‌ను లీవ్ అడగడాన్ని చూసుండరేమో!

ABN , First Publish Date - 2022-06-18T01:48:12+05:30 IST

ఓ ఉద్యోగి తన బాస్‌కు రాసిన లీవ్ లెటర్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. అది చూసి నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడు

Viral News: ఈ కారణంతో ఏ ఉద్యోగీ తన బాస్‌ను లీవ్ అడగడాన్ని చూసుండరేమో!

ఇంటర్నెట్ డెస్క్: ఓ ఉద్యోగి తన బాస్‌కు రాసిన లీవ్ లెటర్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. అది చూసి నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. ‘ఈ రోజుల్లో కూడా మరీ ఇంత నిజాయితీనా’ అని కొందరు కామెంట్ చేస్తే మరికొందరేమో.. సదరు ఉద్యోగి బాస్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా.. ఇంతకూ ఆ లీవ్ లెటర్‌లో ఏముంది అనే పూర్తి వివరాల్లోకి వెళితే..



అత్యవసరాలు మినహా సాధారణంగా ఉద్యోగులు తమ ఉన్నతాధికారుల వద్ద ఏవేవో సాకులు చెప్పి సెలవులు కోరుతూ ఉంటారు. అదే విధంగా వేరే కంపెనీల్లో ఉద్యోగం వెతుక్కునే పనిలో ఉన్నట్టు తమ బాస్‌ల వద్ద పొరపాటున కూడా చెప్పరు. కానీ ఓ వ్యక్తి మాత్రం.. చాలా నిజాయితీగా వ్యవహరించాడు. వేరే కంపెనీలో ఉద్యోగం కోసం ఇంటర్యూకి వెళ్లాలని చెప్పి మరీ సెలవు అడిగాడు. దీంతో ఫిదా అయిపోయిన అతడి బాస్.. సోషల్ మీడియా ద్వారా తాను ఎదుర్కొన్న అనుభవాన్ని నెటిజన్లతో పంచుకున్నాడు. ‘నా జూనియర్లు చాలా మంచి వాళ్లు. వేరే కంపెనీలో ఇంటర్యూకి వెళ్లడానికి లీవ్ ఓ జూనియర్ నన్ను లీవ్ అడిగాడు’ అని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నాడు. అంతేకాకుండా ఆ ఉద్యోగి పంపిన లీవ్ లెటర్‌ను కూడా ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. దీంతో ఈ ట్వీట్ పట్ల నెటిజన్లు రకరకాలు కామెంట్ చేస్తున్నారు. ‘నీ నిజాయితీకి హ్యాట్సాఫ్’ అంటూ సదరు ఉద్యోగిని కొందరు అభినందిస్తుంటే.. మరికొందరేమో ‘ఉద్యోగులతో మీరు ఫ్రెండ్లీగా ఉన్నందు వల్లే అతడు అంత నిజాయితీగా లీవ్ అడిగాడు’ అంటూ సదరు ఉద్యోగి బాస్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. 




Updated Date - 2022-06-18T01:48:12+05:30 IST