రెండో రోజు ఉద్యోగుల నిరసన

ABN , First Publish Date - 2021-12-09T05:50:36+05:30 IST

న్యాయమైన డిమాండ్ల సాధనకు ఉద్యోగులు రెండో రోజు బుధవారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.

రెండో రోజు ఉద్యోగుల నిరసన
మొగల్తూరు పీహెచ్‌సీ ఎదుట ఉద్యోగులు, వైద్యుల నినాదాలు

నరసాపురం,డిసెంబరు 8 : న్యాయమైన డిమాండ్ల సాధనకు ఉద్యోగులు రెండో రోజు బుధవారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. రెవెన్యూ మినహా అన్ని శాఖల ఉద్యోగులు భోజన విరామ సమయంలో కార్యాలయం ఎదుట కొద్ది సేపు నినాదాలు చేశారు. తక్షణం తమ న్యాయమైన డిమాండ్లను అమలు చేయాలని విన్నవించారు. ఏపీ ఎన్జీవో తాలూకా అధ్యక్షుడు కృష్ణ కుమార్‌ , కార్యదర్శి రామసుబ్బారావు ఆధ్వర్యంలో ఉద్యోగలుఉ నిరననలో పాల్గొ న్నారు. మొగల్తూరు , తూర్పుతాళ్ళు పీహెచ్‌సీల వద్ద కూడా నిరసన తెలిపారు. 


పాలకొల్లు అర్బన్‌ : ఉద్యమ కార్యాచరణ ప్రణాళికలో భాగంగా బుధవారం పాలకొల్లు ప్రభుత్వాసుపత్రి, ఎంఎంకేఎన్‌ఎం హైస్కూల్‌ వద్ద ఆందోళన చేశారు.  ఏపీజేఏసి పిలుపు మేరకు వివిధ రూపాల్లో నిరసన తెలియజేస్తున్నట్టు పాలకొల్లు జేఏసీ చైర్మన్‌ గుడాల హరిబాబు, కన్వీనర్‌ వేగేశ్న మురళీ కృష్ణం రాజు తెలిపారు.కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ నుంచి డాక్టర్‌ నళిని, డాక్టర్‌ సంతోష్‌, డాక్టర్‌ చక్రవర్తి, సంఘ రాష్ట్ర కోశాధికారి వీరవల్లి సాయి,యూటీఎఫ్‌ నాయకులు లక్ష్మీనారాయణ, శ్రీనివాసన్‌, అడ్డాల సత్యనారాయణ పాల్గొన్నారు.


భీమవరం :  రాష్ట్ర మునిసిపల్‌ మినిస్టీరియల్‌ ఉద్యోగుల సంఘం ఆధ్వ ర్యంలో మునిసిపల్‌ ఉద్యోగులు రెండో రోజు బుధవారం నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. నిరవధిక కార్యాచరణలో భాగంగా మూడో రోజు గురువారం జిల్లాలోని అన్ని పురపాలక సంఘాల ఉద్యోగులు, కార్మికులు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరవుతారని ఏపీ మునిసిపల్‌ మినిస్టీరియల్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ జిల్లా ప్రెసిడెంట్‌ ఎస్‌.సర్వేశ్వరరావు, జనరల్‌ సెక్రటరీ ఎస్‌ఎ ఇబ్రహీం పాషా తెలిపారు. ఉద్యోగులంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2021-12-09T05:50:36+05:30 IST