పట్టువీడని ఉద్యోగులు

ABN , First Publish Date - 2022-01-21T05:08:51+05:30 IST

ఉపాధ్యాయులు, ఉద్యోగులు భగ్గుమన్నారు. జీతాలు తగ్గించే రివర్స్‌ పీఆర్సీ చీకటి జీవోలు ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశా రు.

పట్టువీడని ఉద్యోగులు
ఆకివీడులో గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేస్తున్న ఉపాధ్యాయులు

మూడో రోజు అదే జోరు
రివర్స్‌ పీఆర్సీపై నిరసన
ఏలూరు తరలిన పలువురు



ఆకివీడు, జనవరి 20 :
ఉపాధ్యాయులు, ఉద్యోగులు భగ్గుమన్నారు. జీతాలు తగ్గించే రివర్స్‌ పీఆర్సీ చీకటి జీవోలు ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశా రు. ప్రభుత్వ తీరుపై మూడో రోజు నిరసన ప్రదర్శన చేశారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్‌ రద్దుచేస్తానని గద్దెనెక్కి అధికారం చేపట్టిన తరువాత మాట తప్పారన్నారు. వైసీపీ ప్రభుత్వానికి తామే తగిన గుణపాఠం చెప్పుతామంటూ హెచ్చరించారు.


పాలకోడేరు : ప్రభుత్వం చీకటి జీవోలను వెంటనే రద్దుచేయాలని ఉపాధ్యాయ సంఘ నాయకులు డిమాండ్‌ చేశారు. ఏలూరులో తలపెట్టిన ధర్నాకు  పాలకోడేరు నుంచి ఉద్యోగులు భారీగా తరలివెళ్లారు. మండల ఫ్యాప్టో నాయకులు విజయరామరాజు,రమణరాజు, త్రిమూర్తులు, సుధాకర్‌,  పాండురంగారావు, శ్రీనివాస్‌ తదితరులు వెళ్లారు. యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బి.గోపిమూర్తిని పోలీసులు గురువారం ముందస్తుగా గృహనిర్బంధం చేశారు.  


కాళ్ళ : ఉద్యోగులు, ఉపాధ్యాయులు చేపట్టిన కలెక్టరేట్‌ ముట్టడికి మండలం నుంచి పెద్ద ఎత్తున ఉద్యోగ సంఘాలు నాయకులు గురువారం తరలివెళ్లారు.     యూటీఎఫ్‌, ఎస్‌టీయూ,పీఆర్‌టీయూ సభ్యులు సుమారు 100 మంది వెళ్లినట్టు యూటీఎఫ్‌ నాయకుడు బీఆర్‌ఎంకె స్వామి తెలిపారు. కార్యక్రమంలో జి.రామకృష్ణంరాజు, వి.జనార్దన్‌, సీహెచ్‌ మోహన్‌బాబు, బి.మురళీ వెళ్లారు.


ఆచంట : ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన పీఆర్‌సీ జీవోను తక్షణం రద్దు చేయాలని కోరుతూ ఏలూరులో తలపెట్టిన ఆందోళనకు ఆచంట మండలం నుంచి సుమారు 70 మంది తరలి వెళ్లినట్టు ఆయా సంఘాల నాయకులు తెలిపారు.
నరసాపురం : పీఆర్‌సీ జీవో తక్షణం రద్దు చేయాలంటూ గురువారం ఉద్యో గ జేఏసీ ఆధ్వర్యంలో తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఉపా ధ్యా యులు,ఉద్యోగులు ఆందోళనలో పాల్గొన్నారు. ఉద్యోగ సంఘ నాయకులు శర్మ, చంద్రరావు, హనుమంతు, అలీ, శైలజ, నాయుడు, గిరి పాల్గొన్నారు.


పాలకొల్లుఅర్బన్‌ :
పీఆర్‌సీ జీవోలకు వ్యతిరేకంగా ఏలూరులో ఉద్యోగ ఉపాధ్యాయులు గురువారం తలపెట్టిన నిరసనకు  పలువురు ఉపాధ్యాయులు, ఉద్యోగులు తరలివెళ్లారు. పాలకొల్లు నుంచి సుమారు 300 మందికి పైగా ఏలూరు వెళ్లినట్టు జేఏసీ నాయకులు గుడాల హరిబాబు, యూటీఎఫ్‌ నాయ కులు ఏకేవీ రామభద్రం, జగ్గారావు తదితరులు తెలిపారు.


ఉండి : ఉండిలో ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. పలువురు ఉపాధ్యా యులు గురువారం ఏలూరు తరలి వెళ్లారు.ఉద్యోగులకు ఇచ్చిన హామీలను  తక్షణమే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సత్యనారా యణరాజు తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


వీరవాసరం :
రివర్స్‌ పీఆర్సీ పై ప్యాప్టో ఇచ్చిన పిలుపు మేరకు ఉపాధ్యాయులు నిరసన కొనసాగిస్తున్నారు. మండలంలోని సుమారు 60 మంది ఉపా ధ్యాయులు విధులకు సెలవు పెట్టి ఏలూరులో గురువారం నిర్వహించిన కలెక్టరేట్‌ ముట్టడికి తరలివెళ్ళారు. ప్రభుత్వం పీఆర్సీ జీవోలు రద్దుచేయాలన్నారు.
పెనుమంట్ర : ఫ్యాప్టో పిలుపు మేరకు ఏలూరు కలెక్టరేట్‌ ముట్టడికి మండలంలోని యూటీఎఫ్‌, ఎస్‌టీయూ, ఏపీటీఎఫ్‌ నాయకులు తరలి వెళ్ళారు. ఉపాధ్యాయ నేతలు సెలవు పెట్టి ముట్టడికి హాజరయ్యారు. లోపభూయిష్టమైన జీవోలను ప్రభుత్వం ఇవ్వడం దుర్మార్గమన్నారు. అవసరమైతే సమ్మె నోటీసు ఇచ్చి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.


పెన్షనర్ల నిరసన


పాలకొల్లుఅర్బన్‌, జనవరి 20 : పెన్షనర్లకు ప్రభుత్వం ఇస్తున్న ఐఆర్‌ కన్నా మెరుగైన ఫిట్‌మెంట్‌ కల్పించాలని పెన్షనర్ల సంఘ నాయకుడు వల వల శ్రీరామమూర్తి డిమాండ్‌ చేశారు.పెన్షనర్ల అసోసియేషన్‌ ఆధ్వర్యంలో గురువారం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన చేశారు. పాత పద్ధ తిలోనే పెన్షన్‌ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. వేతన నిర్ణయం ఐదేళ్ల నుంచి పదేళ్లకు మార్పు చేయడం సరికాదన్నారు. ప్రభు త్వం పునరాలోచన చేయాలని డిమాండ్‌ చేశారు.అనంతరం  నాయకులు తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.కార్యక్రమంలో అధ్యక్షుడు డాక్టర్‌ సి.రాఘవులు, సంఘ కార్యదర్శి దండు చినరామకృష్ణంరాజు,  సభ్యులు డి.రామకృష్ణం రాజు, వంగా నరసింహారావు, పి.సోమరాజు పాల్గొన్నారు.








Updated Date - 2022-01-21T05:08:51+05:30 IST