ఉద్యోగుల్లో..భయం భయం

ABN , First Publish Date - 2020-08-08T06:14:28+05:30 IST

జిల్లాలో కరోనా వైరస్‌ కలవరపెడుతోంది. నిత్యం పదుల సంఖ్యలో పా జిటివ్‌ కేసులు బయట పడుతున్నాయి.

ఉద్యోగుల్లో..భయం భయం

వారియర్స్‌ను వెంటాడుతున్న కరోనా..!

రోజుకు పదుల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు

పోలీస్‌, రెవెన్యూ శాఖలో కలవరం

హోం క్వారంటైన్‌పై కొరవడిన పర్యవేక్షణ


ఆంధ్రజ్యోతి, జగిత్యాల: జిల్లాలో కరోనా వైరస్‌ కలవరపెడుతోంది. నిత్యం పదుల సంఖ్యలో పా జిటివ్‌ కేసులు బయట పడుతున్నాయి. కరోనా వారియర్స్‌గా పిలువబడుతన్న పోలీస్‌, రెవెన్యూ, వైద్య, ఆరోగ్య శాఖలో పలువురికి పాజిటివ్‌ రావడంతో ఆయా శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. జిల్లా కేంద్రమైన జగిత్యాల లో రోజుకు 20 నుంచి 30 పాజిటివ్‌ కేసులు వ స్తుండటంతో భయాందోళనలు నెలకొన్నాయి.


జాడ లేని భౌతిక దూరం

జిల్లాలో రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నా నిబంధనలు పాటించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. భౌతిక దూరంతో పా టు మాస్క్‌లు తప్పనిసరిగా పెట్టాలని ఓవైపు అ ధికారులు, నాయకులు చెబుతూనే.. వారే పా టించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి కరోనాను అరికట్టడం లో ముందుండాల్సిన ప్రజాప్రతినిధులే నిబంధన లు పాటించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలోని ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు, ఎం పీపీలు, ఇతర  ప్రజాప్రతినిధులు ఎక్కడా భౌతి క దూరం పాటించడం లేదు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్న వీరు భౌతిక దూరం అనే పదాన్నే మరిచిపోయి వ్యవహరిస్తున్నారు. దీనికితోడు జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్‌, ధర్మపురిలాంటి పట్టణాల్లో ప్రజలు ఎప్పటిలాగే వ్యవహరిస్తున్నారు. ఎక్కడ కూడా కరోనా నిబంధనలు పాటించడం లేదు. దీంతో జిల్లాలో కరోనా వైరస్‌ మరింత వి జృంభించే అవకాశం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.


ఉద్యోగుల్లో ఆందోళన

జిల్లాలోని పోలీస్‌, రెవెన్యూ, వైద్య, ఆరోగ్య శాఖలో పని చేస్తున్న ఉద్యోగులు కరోనా భయంతో వణికిపోతున్నారు. జిల్లాలోని పోలీసులకు దాదా పు ఇప్పటికే 20 మంది వరకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఒక్కొక్కరు మెల్లిమెల్లిగా కోలుకుంటూ విధులకు హాజరవుతున్నా కొత్తగా మరికొంత మంది పోలీసులు కరోనా బారిన పడి విధులకు దూరంగా ఉంటున్నారు. ఉన్నతాధికారుల భయానికి విధులు నిర్వర్తిస్తున్న కింది స్థాయి ఉద్యోగు లు ఆందోళన చెందుతున్నారు. అలాగే రెవెన్యూ శాఖలో కూడా ఇప్పటికే పలువురికి పాజిటివ్‌ వచ్చింది.


సారంగాపూర్‌, మేడిపల్లి మండలాల్లో పని చేస్తున్న వీఆర్‌వోలు, వీఆర్‌ఏలు, ఆఫీస్‌ అటెం డర్లు, కంప్యూటర్‌ ఆపరేటర్లకు పాజిటివ్‌ రావడం తో రెవెన్యూ ఉద్యోగుల్లో కలకలం రేగుతోంది. దీం తో రెవెన్యూ ఉద్యోగులు పిటిషన్లు తీసుకునేందుకే జంకుతున్నారు. కరోనా వచ్చిన వ్యక్తుల్లో మనోధైర్యం నింపి వారికి సేవలందించాల్సిన వైద్య, ఆరో గ్య శాఖను కూడా కరోనా వెంటాడుతోంది. జిల్లా లో పదుల సంఖ్యలోనే ఏఎన్‌ఎంలు, హెల్త్‌ అసి స్టెంట్లు కరోనా బారిన పడ్డారు. దీంతో వైద్య, ఆరో గ్య శాఖ ఉద్యోగులు భయం భయంగా విధులు నిర్వర్తిస్తున్నారు.

Updated Date - 2020-08-08T06:14:28+05:30 IST