నాటి ఉద్యోగనేతల వల్లే వీఆర్వోల పదోన్నతుల్లో జాప్యం: బొప్పరాజు

ABN , First Publish Date - 2021-02-26T08:54:24+05:30 IST

గత ప్రభుత్వంలో అప్పటి ఉద్యోగ సంఘాల నేతలు వీఆర్వో సంఘనేతలకు లేనిపోని అపోహలు కలగజేసి వీఆర్వోలకు పదోన్నతి ఉత్తర్వులు రాకుండా ఆపేశారని ఏపీ రెవెన్యూ సర్వీసెస్‌ అసోషియేషన్‌...

నాటి ఉద్యోగనేతల వల్లే వీఆర్వోల పదోన్నతుల్లో జాప్యం: బొప్పరాజు

అమరావతి, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వంలో అప్పటి ఉద్యోగ సంఘాల నేతలు వీఆర్వో సంఘనేతలకు లేనిపోని అపోహలు కలగజేసి వీఆర్వోలకు పదోన్నతి ఉత్తర్వులు రాకుండా ఆపేశారని ఏపీ రెవెన్యూ సర్వీసెస్‌ అసోషియేషన్‌ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆరోపించారు. వీఆర్వోల పదోన్నతులపై మూడేళ్లుగా ప్రతిష్టంభన నెలకొందని, రెవెన్యూ శాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌/టైపిస్టుల ప్రయోజనాలు దెబ్బతినకుండా వీఆర్వోల పదోన్నతులు చేపట్టేందుకు ఎలాంటి అభ్యంతరాలే లేవని తమ సంఘం తరఫున తెలియజేయగా, ప్రస్తుత ప్రభుత్వం జీఓ 132 విడుదల చేసిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న జూనియర్‌ అసిస్టెంట్‌లకు నష్టం కలుగజేయకుండా జూనియర్‌ అసిస్టెంట్‌ స్కేల్‌ పొందుతున్న వీఆర్వోలకు నేరుగా సీనియర్‌ అసిస్టెంట్‌ పదోన్నతులు కల్పించాలని, జీఓ 132కు కొన్ని సవరణలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఏపీఆర్‌ఎ్‌సఏ-ఏపీ వీఆర్వో సంఘాలు అంగీకార పత్రాన్ని రాసుకున్నాయని తెలిపారు. దాన్ని అమలుపరిచేందుకు ప్రభుత్వాన్ని కోరాలని ఇరు సంఘాలు నిర్ణయించాయని బొప్పరాజు తెలిపారు.  

Updated Date - 2021-02-26T08:54:24+05:30 IST