కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యోగుల ఆందోళన

ABN , First Publish Date - 2020-09-24T09:08:15+05:30 IST

అన్ని రంగాల్లో ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపడం సరికాదని మాజీ ఎమ్మెల్యే నాగేశ్వర్‌రావు, కేంద్ర ప్రభుత్వ

కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యోగుల ఆందోళన

మంగళ్‌హాట్‌, సెప్టెంబర్‌ 23 (ఆంధ్రజ్యోతి): అన్ని రంగాల్లో ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపడం సరికాదని మాజీ ఎమ్మెల్యే నాగేశ్వర్‌రావు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శి అజీజ్‌ అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య పిలుపు మేరకు భోజన విరామ సమయంలో ఆబిడ్స్‌లోని డాక్‌ సదన్‌ వద్ద ట్యాక్స్‌, పోస్టల్‌ విభాగాలతోపాటు పలు కేంద్ర ప్రభుత్వ శాఖల ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు.


ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాగేశ్వర్‌రావు, అజీజ్‌ మాట్లాడుతూ.. రైల్వే మొదలు కొని అన్ని విభాగాల్లో ప్రైవేటీకరణకు కేంద్ర అడుగులు వేస్తోందని, అది సరైన పద్ధతి కాదని, కార్మిక చట్టాలకు తూట్లు పొడుస్తున్నారని వారు ఆరోపించారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకుండా ఉన్న ఉద్యోగులను తొలగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులపట్ల అవలంబిస్తున్న విధానాలను వెంటనే విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆందోళన కార్యక్రమంలో ఎస్‌ఎ్‌సఆర్‌ఏ ప్రసాద్‌, ఉమ, ఇన్‌కంట్యాక్స్‌ విభాగానికి చెందిన ప్రసాద్‌తోపాటు ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-24T09:08:15+05:30 IST