ఎమ్మెల్సీని అరెస్టు చేయాలి

ABN , First Publish Date - 2022-05-22T05:30:00+05:30 IST

కాకినాడలో దళిత సామాజిక వర్గా నికి చెందిన సుబ్రహ్మణ్యం అనే యువకుడుని హత్య చేసి రోడ్డు ప్రమా దంగా చిత్రీకరించారని, వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్‌ను వెంటనే అరెస్టు చేయాలని తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి వై.నాగేశ్వరరావు యాదవ్‌ డిమాండ్‌ చేశారు.

ఎమ్మెల్సీని అరెస్టు చేయాలి
కలెక్టరేట్‌ ఎదుట నిరసన తెలుపుతున్న టీడీపీ నాయకులు

 డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులకు అండగా ఉంటాం
టీడీపీ ఆధ్వర్యంలో నిరసన


కర్నూలు(అగ్రికల్చర్‌), మే 22:  కాకినాడలో దళిత సామాజిక వర్గా నికి చెందిన సుబ్రహ్మణ్యం అనే యువకుడుని హత్య చేసి రోడ్డు ప్రమా దంగా చిత్రీకరించారని, వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్‌ను వెంటనే అరెస్టు చేయాలని తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి వై.నాగేశ్వరరావు యాదవ్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ఈ విషయంలో పోలీసులు ఏమాత్రం శ్రద్ధ తీసుకోలేదని, దీనికి ప్రభుత్వ ఒత్తిడే కారణమని అన్నారు. దళితుడైన సుబ్రహ్మణ్యంను హత్య చేసిన ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్‌ను వెంటనే అరెస్టు చేయాలంటూ టీడీపీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు జేమ్స్‌ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు కలెక్టరేట్‌ వద్ద గాంధీ విగ్రహం ముందు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా  నాగేశ్వరరావు యాదవ్‌ మాట్లాడుతూ గత మూడేళ్లుగా ఏపీలో దుర్మార్గ పాలన కొనసాగుతోందని అన్నారు. ముఖ్యమంత్రి పైశాచిక ఆనందంలో వందలాది మంది దళితులు, మహిళలు, బీసీలు, మైనార్టీలు నలిగిపోతున్నారని అన్నారు  సుబ్రహ్మణ్యం హత్య  సంఘటనపై ప్రభుత్వం వెం టనే చర్యలు తీసుకోవాలని, ఆయన కుటుంబ సభ్యులకు  ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్‌ నుంచి రక్షణ కల్పించాలని ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు జేమ్స్‌ రాష్ట్ర డీజీపీని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో డోన్‌ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి, ఎస్సీ సెల్‌ అధికార ప్రతినిధి బజారన్న, బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు సత్రం రామకృష్ణుడు, నాయకులు చంద్రకళాబాయి,  హనుమంతరావుచౌదరి పాల్గొన్నారు.

ఆలూరు: వైసీపీ ప్రభుత్వంలో దళితులపై హత్యలు పెరిగిపోయాయని టీడీపీ ఎస్సీసెల్‌ జిల్లా కార్యదర్శి నరసప్స ఆరోపించారు. ఆదివారం జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్ము రామాంజనేయులు అధ్యక్షతన నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాకినాడలో వైసీపీ ఎమ్మెల్సి ఆనంత ఉదయ్‌ భాస్కర్‌  దళితుడైన డ్రైవర్‌ సుబ్రహ్మణ్యంను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపించారు. ఈ విషయంపై టీడీపీ  నిజ నిర్థారణ కమిటీ ద్వారా పరామర్శకు వెళ్ళిన టీడీపీ నాయకులపై పోలీసులు రానివ్వకుండా తోసివేయడం చూస్తే ప్రభుత్వం నిజాలను కప్పి పుచ్చేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఈసమావేశంలో తెలుగు రైతు కమిటీ రాష్ట్ర కార్యదర్శి నారాయణరెడ్డి, టీడీపీ మండల కన్వీనర్‌ ఆశోక్‌, ఎస్సీసెల్‌ జిల్లా నాయకులు ఈరన్న, టీడీపీ నాయకులు సురేంద్ర, వాణిజ్యసెల్‌ రాష్ట్ర జనరల్‌ సెక్రటరీ నారాయణ, నాయకులు ముద్దు రంగయ్య, మసాల జగన్‌, చంద్రశేఖర్‌, ఎర్రన్న, గూళ్యం రామాంజనేయులు పాల్గొన్నారు.

నందవరం:
కాకినాడలో వైసీపీ ఎమ్మెల్సీ ఆనంత ఉదయ్‌ భాస్కర్‌  దళితుడైన డ్రైవర్‌ సుబ్రహ్మణ్యంను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఎస్సీ సెల్‌ మండల అధ్యక్షుడు ముగతి మాజీ సర్పంచ్‌ బాలరాజు, హలహర్వి దావీదు ఆరోపించారు. అదివారం ఆయన మాట్లాడుతూ పోలీసులు కూడా వైసీపీ నాయకులకు వత్తాసు పలుకుతూ కేసును తప్పుదోవ పట్టించెందుకు చూస్తున్నారని ఆరోపించారు. ఈసమావేశంలో బంగారి, నరసిం హులు, విజయ్‌, అనుకు, దాసు, బోజరాజు పాల్గొన్నారు.

పెద్దకడుబూరు:
వైసీపీ ఎమ్మెల్సీ ఆనంత ఉదయ్‌ భాస్కర్‌ను అరెస్టు చేయాలని టీడీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర నాయకుడు ఏసేబు డిమాండ్‌ చేశారు. అదివారం ఆయను విలేకరులతో మాట్లాడుతూ కాకినాడలో వైసీపీ ఎమ్మెల్సీ ఆనంత ఉదయ్‌ భాస్కర్‌  దళితుడైన డ్రైవర్‌ సుబ్రహ్మణ్యంను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపించారు.



Updated Date - 2022-05-22T05:30:00+05:30 IST