Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఉపాధి కోసం వలసెళ్లి మృతి

గుమ్మఘట్ట, డిసెంబరు 7: మండలంలోని గోనబావి గ్రామా నికి చెందిన వన్నూరుస్వామి (32) ఉపాధి కోసం బెంగళూరుకు వ లసెళ్లి.. రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మంగళవారం గ్రామ స్థులు తెలిపిన వివరాలివి. వన్నూరుస్వామి, నాగవేణి దంపతులు గ్రామంలో ఉపాధి లేక బతుకు తెరువు కోసం ఐదు రోజుల క్రితం బెంగళూరుకు వలసెళ్లారు. పిల్లలను స్వగ్రామంలో కుటుంబ సభ్యు ల వద్ద వదలారు. సోమవారం దంపతులిద్దరూ బెంగళూరులో పగలంతా దినసరి కూలీగా పనిచేసి సాయంత్రం తమ గుడారాలకు చేరుకున్నారు. వంట చేసుకునేందుకు సరుకుల కోసం వన్నూరుస్వామి గుడారాల నుంచి కిరాణా షాపుకు వెళ్లాడు. ఈక్రమంలో రోడ్డు దాటుతుండగా వాహనం ఢీకొని వన్నూరు స్వామి అక్కడికక్కడే మృతి చెందాడు. గుడారానికి సరుకులతో ఎంతసేపటికి భర్త రాకపోవడంతో భార్య నాగవేణి ఎదురుచూసింది. చివరికి ఆ ప్రాంతమంతా తిరుగుతూ వెతుకు తుండగా... భర్త వన్నూరుస్వామి శవమై కనిపించడంతో బోరున విలపించింది. మంగళవారం సాయంత్రంభర్త శవంతో స్వగ్రామం గోనబావికి తిరిగి రావాల్సిన దుర్ఘటన చోటు చేసుకుంది. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు వున్నారు. కుటుంబ పెద్దదిక్కును కోల్పోయిన భార్య నాగవేణి పిల్లలను ఎలా పోషించాలో దిక్కుతోచడం లేదంటూ బోరున విలపించారు. ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.


Advertisement
Advertisement