ముందస్తు ప్రణాళిక అవసరం

ABN , First Publish Date - 2022-01-28T05:37:13+05:30 IST

వార్షిక బ్రహోత్సవాలు విజయవంతం చేసేందుకు ముందస్తు ప్రణాళిక అవసరమని ఈవో పురేందర్‌ కుమార్‌ అన్నారు.

ముందస్తు ప్రణాళిక అవసరం
సమావేశంలో మాట్లాడుతున్న ఈవో పురేందర్‌కుమార్‌

- అలంపూర్‌ ఆలయాల ఈవో పురేందర్‌కుమార్‌

- వార్షిక బ్రహ్మోత్సవాలపై అర్చకులతో అత్యవసర సమావేశం  

అలంపూరు, జనవరి 27 : వార్షిక బ్రహోత్సవాలు విజయవంతం చేసేందుకు ముందస్తు ప్రణాళిక అవసరమని ఈవో పురేందర్‌ కుమార్‌ అన్నారు. గురువారం ఈవో చాంబర్‌ అర్చకస్వాములతో అత్య వసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగం గా ఫిబ్రవరి ఆరున వసంతపంచమి రోజున అమ్మ వారి నిజరూప దర్శనానికి పలువురు ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉంద న్నారు. వారికి అవసరమైన అన్ని వసతులు కల్పిం చేందుకు ఆలయ సిబ్బంది, అర్చకులు ముందస్తు ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని సూచించారు. కొవిడ్‌ నిబంధనలపై మైకుల ద్వారా భక్తులను అప్రమత్తం చేయాలని చెప్పారు. జోగుళాంబ సేవా సమితి తరఫున నిర్వహించే గ్రామోత్సవానికి ఆలయ సిబ్బంది సహకరించాలన్నారు. ఉత్సవాల్లో ఏ ఒక్క భక్తుడు అసంతృప్తికి లోనయినా కష్టమం తా వృథా అవుతుందని చెప్పారు. కాబట్టి సిబ్బంది ఏమరపాటు లేకుండా పనిచేయాలన్నారు. పూజా సామాగ్రి తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించా రు.  సమావేశంలో దేవస్థాన ప్రధాన అర్చకుడు ఆనంద్‌శర్మ, పండితులు జానకీ రామశర్మ, అర్చకు లు త్యాగరాజశర్మ, ధనుంజయశర్మ, కృష్ణమూర్తిశర్మ, శ్రీనివాసశర్మ పాల్గొన్నారు. 


31న ఆలయ శుద్ధి

వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ నెల 31న మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 6.30గంటల వరకు భక్తులకు దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ఈవో తెలిపారు. ఆ సమయంలో ఆలయాన్ని శుద్ధి చేసే కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. ఈ విషయంపై భక్తులు దేవస్థానానికి సహకరించాలని కోరారు. 


స్వామి, అమ్మవార్లను దర్శించుకున్న రైల్వే శాఖ ప్రధాన భద్రతాధికారి

అలంపూర్‌ క్షేత్రంలోని జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలను గురువారం దక్షిణమధ్య రైల్వే ప్రధాన భద్రతాధికారి (సికింద్రాబాద్‌) రవీంద్రనాథ్‌రెడ్డి దర్శించుకున్నారు. అంతకు ముందు వారికి ఆలయ ఈవో పురేందర్‌కుమార్‌, అర్చకుడు ఆనందశర్మ స్వాగతం పలికారు. అనంతరం  అమ్మవారికి, స్వామి వారికి ఆయన ప్రత్యేక పూజలు చేశారు.  ఆలయ ప్రధాన అర్చకులు వారికి క్షేత్ర ప్రాశస్త్యాన్ని వివరించారు. ఈ సందర్భంగా  ఈవో పురేందర్‌కుమార్‌ మాట్లాడుతూ జోగుళాంబ రైల్వేస్టేషన్‌లో ప్లాట్‌ఫాం ఎత్తు పెంచాలని, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఆపాలని, ఓవర్‌ బ్రిడ్జి నిర్మించాలని కోరారు. అలాగే రైల్వే స్టేషన్‌లో అలంపూర్‌ ఆలయానికి సంబంధించిన చిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేయాలని కోరారు. వారి వెంట రైల్వే అధికారులు, సిబ్బంది ఉన్నారు.

Updated Date - 2022-01-28T05:37:13+05:30 IST